నిత్యమీనన్.. తన నటనతో నేషనల్ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగిపోయింది. అయితే సినిమాకి బరువుతో సంబంధం లేదు యాక్టింగ్ టాలెంట్ ఒక్కటి ఉంటే చాలు అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.అందుకే నిత్యమీనన్ బరువు పెరిగినా కూడా ఆమెని సినిమాలో హీరోయిన్ గా తీసుకొని హిట్ కొడుతున్నారు.ఇక ఆ మధ్యకాలంలో ధనుష్ హీరోగా వచ్చిన తిరు మూవీలో ఆమె ఎంత లావు ఉందో చెప్పనక్కర్లేదు.కానీ ఈ సినిమాలో తన నటనకి గానూ నిత్య మీనన్ నేషనల్ అవార్డు అందుకుంది. వీరి కాంబోలో సినిమా హిట్ అవ్వడంతో మళ్లీ ధనుష్, నిత్యామీనన్ కలిసి ఇడ్లీ కడాయి సినిమా చేస్తున్నారు.

 అయితే తాజాగా నిత్యమీనన్ ఆ సినిమా కోసం నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఆ పని చేశాను అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. మరి ఇంతకీ నిత్యమీనన్ తన జీవితంలో మొదటిసారి చేసిన ఆ పని ఏంటయ్యా అంటే పేడతో పిడకలు చేయడం.. చాలామంది హీరోయిన్లు సీన్  డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీగా ఉంటారు. అలా ఆ మధ్య కాలంలో రంగస్థలం మూవీ లో సమంత చెరువులోకి దిగి బర్రెలు కడిగే సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా చేసిందో చెప్పనక్కర్లేదు.అలాగే బాలీవుడ్ నటి సోనాలి బింద్రే మురారి మూవీ లో పిడకలు చేసి గోడకు కొడుతుంది. అలా హీరోయిన్లు సినిమాల కోసం ఎప్పుడు చేయని పనులు కూడా చేస్తూ ఉంటారు.

ఇక ఈ హీరోయిన్ల లాగే నిత్యామీనన్ కూడా మొదటిసారి పేడతో పిడకలు చేసిందట. ఇక ఈ సీన్ చేసిన నెక్స్ట్ డే ని ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగిందట.అదేంటంటే నేషనల్ అవార్డు అందుకోవడం. ఇక ఈ విషయం గురించి నిత్యమీనన్ మాట్లాడుతూ.. నేను తిరు సినిమా తర్వాత మళ్లీ ధనుష్ తో ఇడ్లీ కడాయి సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించాను. అయితే పిడకలు చేయడం మీకు ఇష్టమేనా అని డైరెక్టర్ అడగగా ఎందుకు చేయను చేస్తాను అని పేడతో పిడకలు చేశాను. ఇక ఈ పని చేసిన నెక్స్ట్ డేనే తిరు సినిమాలోని నా నటనకు గాను నేషనల్ అవార్డు వచ్చింది.

ఇక ఆ అవార్డు అందుకోవడానికి వెళ్లిన సమయంలో నా గోళ్ళలో ఆ పేడ అలాగే ఉంది.. అయితే ఈ అనుభవం చాలా గొప్పది. ఈ సినిమాలో నేను ఎన్నో సన్నివేశాలను సంతోషంగా చేశాను.అలాగే ఇందులో నటించేటప్పుడు భిన్నమైన విషయాలు కూడా తెలుసుకున్నాను.ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటూ ఇడ్లీ కడాయి మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిత్య మీనన్.ఇక ధనుష్ నిత్యామీనన్ కాంబోలో వస్తున్న ఇడ్లీ కడాయి మూవీ అక్టోబర్ 1న విడుదల కాబోతోంది.ఈ సినిమాలో సత్యరాజ్, శాలిని పాండే, అరుణ్ విజయ్, వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: