ప్రముఖ తెలుగు యూట్యూబర్ పూల చొక్కా నవీన్ ఎక్కువగా సినిమాల రివ్యూస్ ఇతరత్రా విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే విడుదలైన వర్జిన్ బాయ్స్ సినిమాకు సంబంధించి రివ్యూ కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి నిర్మాతగా రాజా దారపునేని యూట్యూబర్ నవీన్ పైన పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు అవ్వడంతో యూట్యూబర్ నవీన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అంశం పైన విచారణ చేపడుతున్నట్లు సమాచారం.


పూర్తి వివరాల్లోకి వెళితే మిత్ర శర్మ, శ్రీహాన్, గీతానంద్ ప్రధాన పాత్రలో నటించినటువంటి వర్జిన్ బాయ్స్ సినిమా డైరెక్టర్ దయానంద్ తెరకెక్కించారు.. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. చిత్ర బృందం కూడా ఈ విషయం పైన సంతోషంగానే ఉన్నారు. ఇందుకు  సంబంధించి సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ధారపునేని రాజా మాట్లాడుతూ ఈ చిత్రం పైన కొంతమంది కావాలనే మీడియా ముసుగులో విషన్ని జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. థియేటర్ కు వెళ్లి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో స్వయంగా  మేమే చూసామంటూ తెలిపారు.


కానీ పూల చొక్కా నవీన్ లాంటి రివ్యూవర్స్ తమ దగ్గర నుంచి డబ్బులను డిమాండ్ చేసి మరి ఇవ్వకపోతే నెగిటివ్గా చేసేందుకు సిద్ధమయ్యారని కావాలని మా సినిమా ఇమేజ్ ని డామేజ్ చేసేలా రివ్యూలను నెగిటివ్గా ఇస్తున్నారు అంటూ తెలిపారు. అతనితో పాటుగా కొంతమంది యూట్యూబర్లు సినిమా రిలీజ్ కాకముందే నెగటివ్ రివ్యూలను ఇచ్చి ఆడియన్స్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ వెల్లడించారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో కూడా ఇలాంటి వారి పైన ఫిర్యాదు చేశామని.. ఇకమీదట వీరి మీద లీగల్ చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయగా పూల చొక్క నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: