ఒక్కోసారి నెగిటివ్ టాక్ & నెగిటివ్ రివ్యూల వల్ల కూడా మంచే జరుగుతుంది అని నా విషయంలో రుజువైంది, ఉదయం నుంచి సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాలేదు అని, టోటల్ గా బాలేదు అని, ఫ్లాప్ అని, డిజాస్టర్ అని అంటుంటే, ఎలాగూ బాలేదు అని ఫిక్స్ అయ్యి సాయంత్రం 6.30 షో కు వెళ్ళాను. అనూహ్యంగా నాకు సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అద్దిరిపోయింది, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ అసలు, కీరవాణి గారు దుమ్ము లేపి దంచి కొట్టారు గురూజీ బీజీయం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సలార్ లో కాటేరమ్మ ఫైట్ రేంజ్ లో ఉంటుంది, ఆ ఫైట్ సీక్వెన్స్ లో కొన్ని ఫ్రేమ్స్ అద్భుతంగా ఉంటాయి, ఢమరుకం మోగించడం, ఎద్దు కొమ్ములు, పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని నిలబడటం, అందరూ కలిసి నడవడం అన్నీ విజువల్ ఫీస్ట్ లాంటి అనుభూతిని కలిగించాయి.


ఏ వీఎఫ్ఎక్స్ గురించి అయితే బాలేదు అంటున్నారో అది నాకు నచ్చింది ఎందుకంటే నా చిన్నప్పుడు చందమామ మ్యాగజైన్ వచ్చేది, నేను రెగ్యులర్ గా భట్టి విక్రమార్క కథలు ఆ బొమ్మలు ఫాలో అయ్యే వాడిని... వెతికితే చంద్రుడిలో కూడా మచ్చలు కనిపిస్తాయి. లోపాలు వెతికి మరీ రాసే రివ్యూలను పక్కన పెట్టండి, సినిమాని కేవలం బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి, ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా. మరో విశేషం ఏమిటంటే 2002 జులై 24న ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యింది, సరిగ్గా 2025 జులై 24 తేదీన హరిహర వీరమల్లు విడుదలైంది, ఇంద్రలో వర్షం కోసం యాగం చేస్తారు, సేమ్ ఈ సినిమాలో కూడా వర్షం కోసం యాగం చేస్తారు, వర్షం పడుతుంది.


పవన్ కళ్యాణ్ కంప్లీట్ వన్ మ్యాన్ షో ... చివరి 45 నిమిషాలు గూస్ బంప్స్
క్రిష్ జాగర్లమూడి & జ్యోతికృష్ణ ఇద్దరి డైరెక్షన్ బ్రిలియంట్ అంతే, బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ సింప్లీ సూపర్.
ఏ సెకండ్ హాఫ్ అయితే బాలేదు అన్నారో ఆ సెకండ్ హాఫే నాకు నచ్చడం ఊహించని విధ్వంసం, నేను కూడా ఎక్కడో ఒక మూల సినిమా పోతుందనే అనుకున్నాను, ట్రైలర్ ఏదో మంచి మంచి సీన్స్, ఫ్రేమ్స్ కట్ చేసి గ్రిప్పింగ్ గా ఎడిట్ చేశారు కానీ క్రిష్ గారు తప్పుకున్నప్పుడే సినిమా పోయింది అని ఫిక్స్ అయిపోయాను, కానీ నేను మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ సండే ఒకసారి సినిమా చూడటానికి రెడీగా ఉన్నాను. సినిమా బాలేదు అన్నవాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు సినిమా చూడలేదని అర్థం, ఎందుకంటే సినిమా చూసి బాగోలేదు అనడానికి మాట రాదు .. నిజంగా సినిమా బాగుంది గురూజీ, బాగున్న సినిమాను కూడా బాలేదు అంటే జనాలకు నచ్చే సినిమాలు ఇంక ఎవ్వరూ తీయలేరు. అసలు పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇలాంటి ఎలివేషన్ ఫైట్ సీక్వెన్స్ పడవు అని అనుకుంటూ ఉండేవాడ్ని, ఈ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్ తో ఆ ఆకలి తీరింది.
రికార్డుల మోత మోగిపోవడం ఖాయం
రేపటి నుండి మొదలవుతుంది పవనుడి ఊచకోత


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: