
కానీ అదే రోజు సాయంత్రానికి పరిస్థితి తారుమారైంది . 'భక్త ప్రహ్లాద' నేపథ్యం తో రూపొందిన ఈ యానిమేషన్ మూవీ ఎమోషనల్ కనెక్షన్ తో పాటు దృశ్య విలాసం తో జనాన్ని మెస్మరైజ్ చేసింది . సాయంత్రానికి మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్ ! రెండో రోజు నుంచే ఆక్యుపెన్సీలు పెరుగుతూ, శనివారం సాయంత్రం అసాధారణ రిపోర్ట్ వచ్చేసింది . ఆదివారం పరిస్థితి మామూలు గా లేదు. 'హరిహర వీరమల్లు ను డామినేట్ చేసే స్థాయి లో ‘మహావతార నరసింహ’కు హైప్ కనిపిస్తోంది . బుక్ మై షోలో గత 24 గంటల్లో వీరమల్లు టికెట్ల సేల్ 1.2 లక్షలైతే , నరసింహ సినిమాకు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి అర్థమవుతుంది !
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ... కన్నడ , హిందీ వెర్షన్లకు కూడా మంచి స్పందన వస్తోంది . ముఖ్యంగా ఫినాలీ ఎపిసోడ్స్ చూసి జనాలు థియేటర్లలోనే చప్పట్లతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా పై కలెక్షన్ రిపోర్ట్స్ కాకుండా , ఎమోషనల్ సీన్‌ల పై పెద్ద చర్చ నడుస్తోంది. ఇంత హైప్ తో ఈ సినిమాకు లాంగ్ రన్ ఖాయమన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది . అన్నిటికీ మించి ఈ సినిమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. అల్లు అరవింద్ సపోర్ట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమా... పవన్ సినిమా ను దాటేస్తుందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ !