ధనుష్.. తమిళ నటుడే అయినప్పటికీ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ మోస్ట్ ఫేమస్ యాక్టర్. ఆకర్షించే రంగు, ఆకట్టుకునే పర్సనాలిటీ లేకపోయినా.. నటనా ప్ర‌తిభ‌, స్వయం కృషితో ధనుష్ భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. సౌత్ లో ఉన్న అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు సొంతం చేసుకున్న ధనుష్.. ఒకవేళ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా? కచ్చితంగా గెస్ చేయలేరు.


సాధారణంగా సెలబ్రిటీలు సినిమాల్లోకి రాకపోయుంటే డాక్టరో, లాయరో ఇలా చెబుతుంటారు. కొందరు బిజినెస్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టే వాళ్ళమ‌ని అంటుంటారు. కానీ ధనుష్ మాత్రం వారందరికీ భిన్నం. నటుడు కాకపోయుంటే ధనుష్ చెఫ్ అయ్యేవాడట. ఎస్‌.. మీరు విన్నది నిజానికి. నిజానికి న‌ట‌న‌పై ధ‌నుష్‌కు ఎటువంటి ఆస‌క్తి లేదు. చిన్న‌త‌నం నుంచి వంట చేయ‌డ‌మంటే పిచ్చి. వంట‌ల్లో కొత్త కొత్త డిషెస్ త‌యారు చేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకోవ‌డ‌మంటే ఇంకా ఇష్టం.


వంట‌ల్లో త‌ల్లికి ధ‌నుష్ ఎప్పుడు మంచి స‌హాయ‌కుడిగా ఉండేవాడ‌ట‌. ఏదైనా స్టార్ హోటల్ లో చెఫ్ అవ్వాలని ధనుష్ భావించాడు. కానీ తండ్రి కస్తూరి రాజాకు మాత్రం కుమారుని హీరో చేయాల‌ని భావించారు. తండ్రి మాట కాదనలేక‌పోయిన‌ ధనుష్‌.. త‌న ఆస‌క్తిని ప‌క్క‌న పెట్టి సినీ పరిశ్ర‌మ వైపు అడుగులు వేశారు. కెరీర్ తొలినాళ్ల‌లో రంగు, రూపం విష‌యంలో ఎన్నో అవ‌మానాలు, మ‌రెన్నో విమ‌ర్శ‌లు ఎదురైన‌ప్ప‌టికీ.. ధ‌నుష్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. మ‌రింత స్ట్రాంగ్ గా నిల‌బ‌డ్డాడు. అదే అత‌నికి భారీ స్టార్డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. కాగా, చెఫ్ కాలేక‌పోయిన ఇప్ప‌టికీ స‌మయం దొరికిన‌ప్పుడ‌ల్లా వంటింట్లో ప్ర‌యోగాలు చేయ‌డం ధ‌నుష్ కు ఉన్న అల‌వాటు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: