
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి . కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమా కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కొరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వనే లేదు అప్పుడే మరొక ఛాన్స్ కొట్టేసాడు డైరెక్టర్ అన్న వార్త సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది . డైరెక్టర్ వశిష్ట తన నెక్స్ట్ సినిమా ను స్టార్ హీరోతో ఫిక్స్ అయ్యాడు అన్న వార్త ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు అక్కినేని నాగచైతన్య .
"తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ..కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా తర్వాత మరొక కోలీవుడ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త ట్రెండ్ అవుతుంది . అయితే ఈ గ్యాప్ లోనే వశిష్ట రాసుకున్న స్టోరీ నాగ చైతన్య కి వినిపించగా ఆయన ఓకే చేశారట. ఈ సినిమా చాలా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అన్న వార్త ఫిలిం వర్గాలల్లో ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??