
అయితే విశాల్ కి సంబంధించిన తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . విశాల్ కి ఎలాంటి జబ్బు లేదు ఆయన పర్ఫెక్ట్ గా ఫిట్ అంటూ ప్రూవ్ చేసేలా చేసింది. తాజాగా విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది . ఆయన మేనకోడలు ఓ విదేశీయుడిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది . ఈ శుభకార్యానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ . తన కుటుంబంతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు .
పట్టు పంచె.. సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తూ ..పెద్దల ఆశీర్వాదం తీసుకొని వధూవరులను ఆశీర్వదించిన ఆయనను చూసి ఫ్యాన్ ఫుల్ ఖుషి అయిపోయారు . విశాల్ కి ఆరోగ్యం బాగోలేదు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేనేలేదు అంటూ క్లారిటీకి వచ్చేసారు ఫ్యాన్స్. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులే కాదు సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు . ఎవరైతే విశాల్ హెల్త్ బాగోలేదు అంటూ ట్రోల్ చేశారో..వాళ్ల నోరు మూయించేసాడు ఈ హీరో అంటూ పొగిడేస్తున్నారు కోలీవుడ్ స్టార్స్ . విశాల్ ఈ వీడియోలో చాలా హ్యాపీగా ఆనందంగా ఉండడం అభిమానులని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది..!