
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్లో ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించారు మూవీ మేకర్స్. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది . జూనియర్ ఎన్టీఆర్ వేదిక ముందు కూర్చుని ఉన్న సమయంలో ఒక్కసారిగా నందమూరి అభిమాని వచ్చి ఆయన కాళ్లు మొక్కుతారు. దీంతో షాక్ అయిన జూనియర్ ఎన్టీఆర్ వెంటనే అతనిని పైకి లేపి హగ్ చేసుకుంటారు . అయితే పక్కనే ఉన్న హృతిక్ రోషన్ మాత్రం సెక్యూరిటీని కళ్లతో సైగలు చేస్తూ లాగేయండి అన్నట్లు చెబుతాడు .
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కొంతమంది ఈ వీడియోని చూసి జూనియర్ ఎన్టీఆర్ మంచితనాన్ని పొగిడేస్తుంటే ..హృతిక్ రోషన్ హెడ్ వెయిట్ ని తప్పుపడుతున్నారు . మా తెలుగు హీరో చూడు అభిమానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ..నువ్వు ఉన్నావు ఎందుకు అంటూ హృతిక్ రోషన్ పై ఘాటుగా ఫైర్ అవుతున్నారు . కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 1200 మంది పోలీస్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవెంట్ నిర్వహించారు . పూర్తిగా సక్సెస్ఫుల్గా ఈవెంట్ సక్సెస్ అయిందని అంటున్నారు అభిమానులు , జనాలు..!!