నిన్న హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల కలియికలో రాబోతున్న బిగ్ మల్టీస్టారర్ మూవీనే ఈ వార్ 2.  ఈ వేడుకలో సూర్యదేవర నాగవంశీ అదే విధంగా త్రివిక్రమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఈ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ హైలెట్ గా మారింది . హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ని పొగుడుతూ మాట్లాడిన మాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే ఆ హీరో ..కోస్టార్ బాగా హైలైట్ అవుతూ ఉంటారు . కానీ వార్ 2 విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయిపోయింది .


వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది . సూపర్ సక్సెస్ అయ్యింది.  కానీ ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కన్నా హృతిక్ రోషన్ మాట్లాడిన మాటల కన్నా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు స్పీచ్ హైలెట్గా మారింది . ఇప్పుడు అందరూ ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు . త్రివిక్రమ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.." దేవర విడుదలైనప్పుడు ఆ ఏడాది దేవరనామ సంవత్సర అని చెప్పాను.. ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరం అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు" .



"మెరుపు తీగలా ఉన్న ఇద్దరినీ ఒకే తెరపై చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ కోరుకుంటున్నాను.  ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు అంతకుమించిన లెవెల్ లో ఉంటుంది . దర్శకుడు అయాన్ నాకు అదే చెప్పారు.  అయాన్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది . ఇది సాధారణ యాక్షన్ మూవీ అయితే కానేకాదు . సాధారణ యాక్షన్ మూవీకి ఎన్టీఆర్ అవసరం లేదు.  ఎన్టీఆర్ ని ఏరి  కోరి చూస్ చేసుకున్నారు అంటే ఇది అంతకు మించిన ప్రాజెక్ట్. ఏ భావోద్వేగానైనా పలికించగలనటుడు ఎన్టీఆర్" అంటూ త్రివిక్రమ్ మాట్లాడారు.



త్రివిక్రమ్ ఇంకా మాట్లాడుతూ.." అందరికీ తెలిసిందే బంగారం ఉంటే నగ చేయించుకుంటారు కానీ బీరువాలో పెట్టుకోరు కదా.. ఎన్టీఆర్ కూడా  అలాంటివాడే బంగారం లాంటి వారు.. ఏ నగ చేయించాలో అయాన్ కి బాగా తెలుసు . అందుకే ఎన్టీఆర్ కోసం ఇక్కడిదాకా వచ్చారు . ఎన్టీఆర్ - హృతిక్ ల వింధ్య - హిమాలయాల పర్వతాలు లాంటి వారు " అంటూ పొగిడేశారు . ఈసారి వినాయక చవితి సంబరాలలో వార్ 2 పాట వినపడుతూనే ఉంటుంది అని .. ఆగస్టు 14న విడుదలయ్యే వార్ 2 అందరిని అలరిస్తుంది అని అందరూ ఈ మూమెంట్ ని తప్పక చూడాలి అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: