
వరుసగా మూడు రోజుల సెలవులు రావడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అంతేకాకుండా, ఈ సినిమా ఓవర్సీస్‌లో ఆల్‌టైమ్ రికార్డు బీట్ చేసింది. రజనీకాంత్ సినిమా అంటే కలెక్షన్స్ పరంగా ఆందోళన పడాల్సిన అవసరమే లేదు — అది అందరికీ తెలిసిందే. ఆయన సినిమా ఎక్కడ, ఎప్పుడైతే రిలీజ్ అయినా సరే, హౌస్‌ఫుల్ షోలు ఖాయం. ఈసారి కూడా అదే జరిగింది. రజనీకాంత్ నటించిన "కూలీ" ఓవర్సీస్‌లో సంచలన రికార్డు నెలకొల్పింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు ₹24.26 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది రజనీకాంత్ అభిమానులకు ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చే వార్త.
లోకేష్ కనగ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా నే రికార్డ్స్ బ్లాస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ కోలివుడ్ సినిమా సాధించని రికార్డ్స్ సాధించింది. అత్యధికంగా ₹24.26 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, "కూలీ" సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి రికార్డ్ సాధించిన తమిళ్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రత్యేకంగా ప్రకటించింది. ఓవర్సీస్‌లో "కూలీ" ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.