
ఈ సినిమా బాలీవుడ్‌లో బాగానే ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా, “జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాను ఎంచుకున్నాడు?” అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. వార్ 2 తెలుగులో హిట్ కాకపోవడానికి, తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోవడానికి మరో కారణం కూడా ఉందన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. సినిమాలో మన తారక్ తప్ప మిగతా నటీనటులు అందరూ బాలీవుడ్ వారే. తెలుగు నటీనటులు ఎక్కడా కనిపించకపోవడం, తెలుగు ప్రేక్షకులకు సినిమా రీచ్ కాకపోవడానికి ఒక మైనస్ పాయింట్‌గా మారింది. అంతేకాదు, బాలీవుడ్‌లో చేసినంత ప్రమోషన్‌ను టాలీవుడ్‌లో చేయలేకపోయారు.
సినిమా రిలీజ్‌కు మూడురోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి, కేవలం కొన్ని మాటలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, అది వర్కౌట్ కాలేదు. ఆ కారణంగానే తెలుగులో వార్ 2 నెగటివ్ టాక్ సంపాదించుకుందని కొందరి అభిప్రాయం.కొంతమంది “నువ్వు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి నెగటివ్ షేడ్స్ పాత్ర చేయడం తప్పు చేశావు తారక్” అని కూడా అంటున్నారు. మొత్తానికి, ఈ వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కు పూర్తిగా నెగెటివిటీ తెచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.