
రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ కామెంట్లు చేయడం గమనార్హం. లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చుడనివ్వనంటూ ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతపురంలో వార్2 సినిమా షోలు నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు వార్2 మూవీ స్పెషల్ షోకు హాజరు కావాలని ఒక టీడీపీ నేతను ఇన్వైట్ చేయగా సదరు టీడీపీ నేత బూతు పురాణం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియోల విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి హీరో గురించి ఇష్టానుసారం చేస్తున్న కామెంట్లు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి. తన గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వాళ్లపై తారక్ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతు ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు