"అనిరుధ్" ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బాగా మారుమ్రోగిపోయిన పేరు. ఒకటి కాదు, రెండు కాదు – చేతిలో దాదాపు అన్ని బడా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న అతిపెద్ద ప్రాజెక్టులన్నింటికీ కూడా వర్క్ చేస్తున్నది అనిరుధ్ నే. అంతేకాదు, కోలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పటికే శాసిస్తున్న ఆయన, ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకి కూడా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇటీవల అనిరుధ్ మ్యూజిక్ అందించిన "కూలీ" సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా, మ్యూజిక్‌కి "పర్వాలేదు" అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నట్టుంది అన్న అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా, అనిరుధ్‌కి ప్లస్ మార్కులు రావడం కంటే, ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా రాలేదనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి.


కొంతకాలంగా అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలు వరుసగా నెగిటివ్ టాక్ సంపాదించుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన "వెటాయన్" అలాగే "విడమూర్చి" సినిమాలు అనిరుధ్‌కి బాగా నెగిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. ఇక విజయ్ దేవరకొండ "కింగ్డమ్" అయితే అనిరుధ్‌కి అస్సలు గుర్తింపు లేకుండా చేసింది. తాజాగా వచ్చిన కూలీ చిత్రం కూడా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే అనిరుధ్ కమిట్ అయిన తర్వాతి ప్రాజెక్టులకు డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయనకి  స్వయంగా కాల్ చేసి "సినిమా మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉండాలి" అని డైరెక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ అనిరుధ్‌పైనే ఇంత ఇంట్రెస్ట్ చూపించడం చాలా మందిలో డౌట్స్‌ వచ్చేలా చేస్తుంది.



త్వరలోనే సెట్స్‌పైకి రాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అంటే – అది ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లేనని సినీ ప్రముఖులు అంటున్నారు. అనిరుధ్‌కి అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఇచ్చే మ్యూజిక్ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా, ఆయన మ్యూజిక్ మాత్రం యూత్‌లో బాగా హిట్ అవుతుంది. ఆ కారణంగానే అనిరుధ్‌కి చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు అవకాశాలు ఇస్తున్నారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి .. అనిరుధ్ తన మ్యూజిక్ లెవెల్స్‌ని ఇంక్రీస్ చేసి, సినిమాలకు హిట్ టాక్ తెచ్చేలా ప్రయత్నిస్తాడో లేదో..!

మరింత సమాచారం తెలుసుకోండి: