
ఇటీవలే సినిమా షూటింగ్ జరగగా ఇందులో షారుఖ్ ఖాన్ గాయపడినట్లుగా వార్తలు వినిపించాయి. ఇందులో ఒక యాక్షన్స్ సన్నివేషంలో డూప్ లేకుండా చేయాలని సల్మాన్ ఖాన్ భావించి గాయాల పాలయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నేటిజన్స్ కూడా కొంతమేరకు ఆందోళన పడుతున్నారు. గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ నిలిపివేసిన చిత్ర బృందం షారుక్ ఖాన్ కు గాయమైనప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషయంపై సరైన అప్డేట్ లేక అభిమానులు అయోమయంలో పడిపోయారు.
షారుక్ ఖాన్ కుమారుడు తెరకెక్కించిన ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ ట్రైలర్ ఈవెంట్ లో తన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను తెలియజేశారు షారుఖ్ ఖాన్.. షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. కింగ్ సినిమా షూటింగ్ సమయంలో గాయం కావడం వల్ల తను సర్జరీ చేయించుకున్నానని కేవలం ఒక్క చేత్తోనే బ్రష్ చేస్తున్నాను తన పనులన్నీ తానే పూర్తిగా చేసుకుంటున్నానని మరో రెండు నెలలో పూర్తిగా కోలుకుంటానని తెలియజేశారు. అవార్డు అందుకోవడానికి కూడా ఒక చెయ్యి చాలు అని తన మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమను భుజాన్ని ఎత్తుకోవడానికి మాత్రం రెండు చేతులు కావాల్సిందే అంటే తెలిపారు. దీంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ తమ హీరో త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.