చిరంజీవి అంటే ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఇండస్ట్రీని శాసించేంత స్టాండర్డ్‌ ఉన్న ధైర్యం, గౌరవం. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన బర్త డే కానుకగా ఆయన నెక్ట్స్ సినిమాల నుంచి రకరకాల అప్డేట్స్ రిలీజ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న “విశ్వంభర” స్పెషల్ గ్లింప్స్ విడుదల అయ్యి మ్మచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇంతకాలం “విశ్వంభర సినిమా ఎలా ఉంటుంది?” అని అందరూ మాట్లాడుకున్నా, ఆ చిన్న గ్లింప్స్‌తోనే ఇది మంచి హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. కథ కాన్సెప్ట్ కూడా పూర్తిగా డిఫరెంట్‌గా ఉందని రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆధారంగా తెలుస్తోంది.


ఇక చిరంజీవి బర్త డే సందర్భంగా నేడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయబోయే కొత్త సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. అంతేకాదు, తన తదుపరి ప్రాజెక్ట్‌ను బాబీ కొల్లితో కమిట్ అయ్యారని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నేడే రాబోతోందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే జనాలు ఒక్క ప్రశ్న అడుగుతున్నారు..చిరంజీవి ఎందుకు ఇంత స్టార్డమ్ సంపాదించుకున్నారు? ఆయన ఎందుకు ఇంత హై పాపులారిటీ దక్కించుకున్నారు? యూత్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి?



చిరంజీవి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, తన ప్రతిభతో పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు. ఆయన పేరుతోనే ఇండస్ట్రీలోకి నలుగురు హీరోలు వచ్చేలా ఒక బలమైన బ్రాండ్‌గా నిలిచారు. దీని వెనుక కారణం ఆయన డెడికేషన్, కష్టపడే తత్వం, టాలెంట్ అని సినీ ప్రముఖులు చెబుతున్నారు. చిరంజీవి ఏ పనినైనా చాలా సీరియస్‌గా తీసుకొని, దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరని చాలామంది డైరెక్టర్లు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్, మరోవైపు సినిమా లైఫ్ రెండింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకున్న ఘనత చిరంజీవికి దక్కుతుంది. చిరంజీవిలా యంగ్ స్టార్స్ కూడా ఏదైనా అనుకుంటే సాధించేంత మొండితనం, పట్టుదల పెంచుకుంటే తప్పక తమ లైఫ్‌లో సక్సెస్ అవుతారు అని జనాలు అంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి హైలైట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: