
అలాంటి మహేష్ బాబు - రాజమౌళితో సినిమా ఎలా ఒప్పుకున్నాడు? రాజమౌళి ఏమి చెప్పి ఆయనను కన్విన్స్ చేశాడు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, మొదట రాజమౌళి ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబును కాకుండా మరొక బిగ్ స్టార్‌ను అనుకున్నారట. ఆయనే కోలీవుడ్ హీరో సూర్య. నిజానికి "బాహుబలి" సినిమాను కూడా సూర్యతోనే అనుకున్నారు కానీ కుదరలేదు. అంతకుముందు "మగధీర" సినిమాకి కూడా ఆయనే మొదటి ఆప్షన్ అని చెబుతారు, కానీ అది కూడా కుదరలేదు. ఈ కొత్త సినిమాను కూడా సూర్యతో అనుకున్నప్పటికీ, అదృష్టం కలిసిరాలేదు.
తర్వాత రాజమౌళి ఈ మూవీ కాన్సెప్ట్‌ను కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న సమయంలో, టీవీలో మహేష్ బాబు నటించిన అతడు సినిమా వస్తుందట. ఆ సినిమా ఎన్నిసార్లు టీవీలో టెలికాస్ట్ చేస్తారో అందరికీ తెలిసిందే. సరిగ్గా “గోడని చేతులతో గుద్దే సీన్” వచ్చే సమయంలో, రాజమౌళి రాసుకున్న ఒక సీన్‌కి మహేష్ బాబు బాగా సూట్ అవుతాడు అని ఆయనకు అనిపించిందట. అదే సమయంలో ఆయన ఆలోచనలో పడి, మెల్లగా మొత్తం స్టోరీని మహేష్ బాబుతోనే తెరకెక్కించేలా ఊహించుకున్నారట. చివరికి ఆ విషయం కుటుంబ సభ్యులతో షేర్ చేయగానే వారు కూడా ఓకే చేశారు. తర్వాత రాజమౌళి కథను మహేష్ బాబుకి వినిపించగా, ఆయనకి నచ్చేసి వెంటనే ఓకే చేశారట. అలా "అతడు" సినిమా కారణంగానే ఇప్పుడు రాజమౌళి–మహేష్ బాబు సినిమా సెటప్ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.