
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ మిక్స్‌గా ఉంటాయని మనందరికీ తెలుసు. అదే తరహాలో ఈ సినిమాలో కూడా ప్రతి పాత్రను హైలెట్ చేస్తూ, ఒకదాని కంటే ఒకటి బెటర్‌గా డిజైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర – ఇది గెస్ట్ అప్పియరెన్స్ కాదని చెప్పాలి. దాదాపు 15 నిమిషాల పాటు స్క్రీన్‌పై కనిపించే ప్రత్యేకమైన క్యారెక్టర్ అని సమాచారం. ఈ పాత్రను ఇంటర్వెల్ ముందు, తరువాత రెండు భాగాలుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యూజికల్‌గా కూడా సినిమాపై అంచనాలు పెంచే ప్లాన్ చేశారు. ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసి, దానిలో చిరంజీవి గతంలో చేసిన ఒక క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నారు. ఆ పాట ఏదన్నది మాత్రం పూర్తిగా సస్పెన్స్‌గా ఉంచారు. ఈ రీమిక్స్ సాంగ్ సినిమాకి ఒక హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్పుకుంటోంది.
అదే కాదు, ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఉంది. హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నా కూడా, ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం టాప్ బ్యూటీని రోప్ చేశారు అనే టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు – వరుసగా ఐటమ్ సాంగ్స్‌తో దూసుకెళ్తున్న గ్లామరస్ బ్యూటీ "పూజా హెగ్డే". ఆమె చిరంజీవితో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయబోతుందట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్‌గా మారింది. చిరంజీవి ఏజ్, పూజా హెగ్డే ఏజ్ మధ్య పోలికల గురించి చాలామంది మాట్లాడుతున్నా, అనిల్ రావిపూడి మాత్రం పాటపైనే నమ్మకంగా ఉన్నాడు. ఈ సాంగ్ సినిమాలో ఎటువంటి బారియర్స్ లేకుండా, ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి ఓ మేజర్ హైలైట్ అవుతుందని మూవీ మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో అభిమానుల్లో ఎక్సైట్‌మెంట్ పెరిగిపోయింది. సంక్రాంతి బరిలోకి దిగబోతున్న ఈ సినిమా, మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ పండగ కానుకగా మారబోతోందని చెప్పొచ్చు.