
నారా రోహిత్ హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుందరకాండ. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ నెల 27న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా బాగా వచ్చిందంటున్నారు.
1. సినిమా స్టార్ట్ అయిన 10 నిముషాల్లోనే అసలు కథ స్టార్ట్ అవుతుంది...
2. హీరో ఎలాంటి వాడు.. అతనికి కావాల్సిన అమ్మాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు...
3.రెండు లవ్ స్టోరీస్ కూడా ఫస్ట్ హాఫ్ లోనే చూపించడం కొత్తగా ఉంది...
4.ఫస్ట్ హాఫ్ లో వచ్చే మూడు పాటలు కూడా సిట్యుయేషన్, ప్లేసెమెంట్ బాగుంది..
5. కథలో కలిసి ఉన్న కామెడీ కూడా ఆకట్టుకుంటుంది.. సత్య, సునైనా జోడీ బాగుంది.. అభినవ్, వాసుకి, నరేష్ విజయ కృష్ణ, రూపలక్ష్మి మధ్య సీన్స్ కూడా బాగున్నాయి..
6. ఇంటర్వెల్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్.. అసలు ఊహించని సిట్యుయేషన్ లో ఊహించని షాక్ తో ఇంటర్వెల్ ఉంటుంది.
7. అంత షాకింగ్ ఇంటర్వెల్ తరువాత డైరెక్టర్ కథని నడిపించిన విధానం బాగుంది..
8. హీరో తనకి తగిలిన షాక్ నుంచి బయటపడి తన ప్రేమని ఎలా గెలిచాడు అనేది ఆధ్యాంతం ఆసక్తికరంగా ఉంది..
9. ఆడియన్స్ ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది.. సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి..
10. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ స్టోరీస్ రావడమే అరుదు.. అలాంటిది ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ స్టోరీ రాయడం నిజంగా గ్రేట్..
11.సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ట్...అన్నీ కథని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు