
ఉత్తరాది నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ దీక్ష పంత్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రచ్చ, నూతిలో కప్పలు, సోగ్గాడే చిన్నినాయన, గోపాల గోపాల, బంతిపూల జానకి, ఈగో తదితర చిత్రాలలో నటించిన దీక్ష పంత్. దీంతో ఈమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో అవకాశం సంపాదించుకుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన అందం ,మైండ్ గేమ్ తో బాగానే అలరించిన దీక్ష టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యింది.
అయితే గడిచిన ఎనిమిదేళ్లుగా దీక్ష పంత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరిగా ఈమె ఈగో అనే చిత్రంలో నటించినది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్, బిగ్ బాస్ ,ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు వ్యాఖ్యలు చేసింది. తాను సినిమాలలోకి రావాలనుకోలేదని మోడలింగ్ వైపుగా వెళ్లాలనుకున్నాను అంటూ తెలిపింది. అనుకోకుండా వచ్చానని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించగా..? ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో ఉన్నవారికి వచ్చే సమస్య ఏంటి అంటూ దీక్ష ప్రశ్నించింది?.. తాను ఇండస్ట్రీలో ఇలాంటి ఎప్పుడు ఎదుర్కోలేదని..ఎవరికీ ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తారు.. ఇలాంటి విషయాలకు తమ దూరంగానే ఉంటానని తెలిపింది..
మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చాలామంది పలు రకాల సైగలు చేసేవారు.. వాటికి తాను ముఖం మీద నో అని చెప్పేదాన్ని వెంటనే వారు రిజెక్ట్ చేసేవారని.. అవకాశాల కోసం క్లోజ్ గా ఉండలేము అందుకే నటిగా సక్సెస్ కాలేకపోయామంటూ తెలియజేసింది.