
ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తారక్ ఇకపై కథల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో, తమ స్టార్ హీరోకి తగిన స్థాయి ఉన్న డైరెక్టర్లతో పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టులు రావాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా సందీప్ రెడ్డి వంగ వంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించక మానదని అభిమానులు నమ్ముతున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో అనిమల్ పార్క్ అనే సీక్వెల్ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత తారక్‌తో సినిమా చేయాలని అభిమానులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాష్‌టాగ్‌లతో ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ, "సందీప్-తారక్ కాంబినేషన్ రావాల్సిందే!" అని డిమాండ్ చేస్తున్నారు.
అభిమానుల మాటల్లో, "తారక్‌కి ఉన్న కటౌట్, ఫ్యాన్ ఫాలోయింగ్, నటనా ప్రతిభకు తగిన స్థాయి సినిమా రావాలి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ఒక సినిమా పడితే బాక్స్ ఆఫీస్ బ్లాస్టే. ఇది తారక్ కెరీర్‌లో మరొక కొత్త చరిత్ర సృష్టిస్తుంది. దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావంటే ఈ కాంబినేషన్‌ను సెట్ చేయించు" అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తారక్ అభిమానులు ఈ డిమాండ్‌పై ఇండస్ట్రీలోనూ చర్చ మొదలైంది. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తవ్వగానే తారక్‌తో సినిమా చేసే అవకాశముంటుందా? లేక ఈ కల కేవలం అభిమానుల కలగానే మిగిలిపోతుందా? అన్నది చూడాలి. ఏదేమైనా తారక్ కెరీర్‌లో కొత్త రేంజ్ ప్రాజెక్టులు అవసరం అన్న విషయం మాత్రం నిజం.