అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంతో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతాన్ని బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోంది. అఖిల్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విధంగా పూర్తిగా చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఈ మాడ్యులేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా చుట్టూ రూమర్లు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వినిపిస్తున్న ఒక వార్త ప్రకారం, సినిమాలో అఖిల్ సిస్టర్ రోల్ చాలా ఎమోషనల్‌గా సాగుతుందట. ఆ పాత్ర కోసం ఓ సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ ఎమోషన్‌లో ఈ పాత్ర కీలకంగా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, అఖిల్ పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. ఇది అఖిల్ కెరీర్‌లో కొత్త ఎక్స్‌పెరిమెంట్‌గా మారబోతోందని సినీ స‌ర్కిల్స్‌ చెబుతున్నాయి.


అఖిల్‌కు జోడీగా అందాల భామ శ్రీలీల నటిస్తోంది. అఖిల్ - శ్రీలీల జోడీ తెరపై చూడడానికి ఫ్రెష్‌గా ఉండబోతోందనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ జ‌నాల్లో ఉంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండుతుందని టాక్ ?  రొమాంటిక్ సీన్లు అయితే అదిరిపోయాయంటున్నారు. యూనిట్ అనుకుంటున్న ప్రణాళిక ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో మంచి బ్రేక్ ఇవ్వాలన్న నమ్మకంతో ఈ సినిమాపై ఆయన ఎంతో హోప్స్ పెట్టుకున్నాడు. రాయలసీమ సెటప్, చిత్తూరు యాస, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, రొమాన్స్ అన్నీ కలిపి లెనిన్ సినిమాను ఒక ప్యాకేజీ ఎంటర్‌టైనర్‌గా మార్చబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: