పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ఓపెనింగ్లు అద్భుతమైన రీతిలో దక్కాయి. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలాకు కూడా దగ్గరగా వచ్చేసింది. కానీ విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను వసూలు చేసే విషయంలో మాత్రం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున తడబడింది.

పవన్ గతంలో నటించిన సినిమాల స్థాయిలో కూడా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరవ రోజు కలెక్షన్లను వసూలు చేయలేదు. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.83 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన అత్తారింటికి దారేది సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.77 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్టాల్లో కలిపి 3.32 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఓజి సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇలా పవన్ కళ్యాణ్ గతంలో తాను నటించిన సినిమాలతో పోలిస్తే విడుదల అయిన ఆరవ రోజు ఓజి సినిమాతో తక్కువ కలెక్షన్లను అందుకున్నాడు. ఓజి మూవీ లో పవన్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: