టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శ్రీకాంత్ , కమీలిని ముఖర్జీ , ప్రకాష్ రాజ్ , జయసుధమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని 2014 వ సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.

మూవీ దర్శకుడు అయినటువంటి కృష్ణ వంశీసినిమా స్టార్ట్ కావడానికి ముందు అనేక కష్టాలను ఎదుర్కొన్నట్లు ఆయన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా కృష్ణ వంశీ మాట్లాడుతూ ... గోవిందుడు అందరివాడేలే సినిమా కంటే ముందు నేను చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. ఏ మూవీ కంటే ముందు నేను దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర వరుసగా ఫెయిల్యూర్ అయ్యాయి. దానితో నాతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాలేదు.

నేను ఎంతో మంది తో సినిమా చేయడానికి ప్రయత్నించాను. కానీ ఏది సెట్ కాలేదు. అలాంటి సమయం లో ఒక సారి చిరంజీవి గారితో చరణ్ తో సినిమా చేయడానికి నా దగ్గర ఒక కథ ఉంది అని అన్నాను. అది కూడా సెట్ కాదు అనుకున్నాను. కానీ చిరంజీవి గారు నా దర్శకత్వంలో చరణ్ హీరోగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలా గోవిందుడు అందరివాడేలే సినిమా సెట్ అయ్యింది అని కృష్ణ వంశీ ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: