నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయిక అంటేనే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం. వీరి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు సాధించిన బ్లాక్‌బస్టర్ విజయాలు.. ప్రస్తుతం రూపొందుతున్న 'అఖండ 2' పై  అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ముఖ్యంగా, 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా నందమూరి అభిమానుల్లోనే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.'అఖండ 2' సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని, దర్శకుడు బోయపాటి శ్రీను తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సినిమా 'అఖండ' రికార్డులను బద్దలు కొట్టేలా ఉండబోతోందనే బలమైన విశ్వాసం చిత్ర యూనిట్‌లో ఉంది.


సెకండ్ హాఫ్ సీన్స్: 'నెవ్వర్ బిఫోర్' అనుభూతి!:
తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం, 'అఖండ 2' సినిమా సనాతన ధర్మం గురించి వివరిస్తూనే, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం సెకండ్ హాఫ్ సీన్స్. ఈ దృశ్యాలు 'నెవ్వర్ బిఫోర్' అన్నట్లుగా ఉంటాయని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాలు వచ్చి ఉండవని చిత్ర యూనిట్ సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విజువల్ వండర్‌గా ఉండటంతో పాటు, ప్రేక్షకులను ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే విధంగా, ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా బోయపాటి సెకండ్ హాఫ్‌ను డిజైన్ చేశారని బాలకృష్ణ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సాధారణంగానే యాక్షన్ సినిమాలకు ది బెస్ట్ ఇచ్చే బాలకృష్ణ, బోయపాటి సినిమా కోసం నూటికి నూరు శాతం సహకారం అందించారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



తమన్ నేపథ్య సంగీతం: పూనకాలు ఖాయం!:
'అఖండ 2' సినిమా స్థాయిని పెంచడంలో సంగీత దర్శకుడు తమన్ కీలక పాత్ర పోషించనున్నారు. తమన్ ఇప్పటికే చాలా ప్రత్యేకమైన సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 'అఖండ' సినిమాకు తమన్ ఇచ్చిన బీజీఎంకు థియేటర్లలో బాక్స్‌లు పగిలిపోయే స్థాయిలో స్పందన వచ్చింది. ఈసారి 'అఖండ 2' విషయంలోనూ తమన్ అంతకు మించి డెడికేషన్‌ను కనబరుస్తున్నాడు. బోయపాటి అద్భుతమైన కాన్సెప్ట్‌, సీన్స్‌కు తమన్ అందుకు తగ్గట్లుగా సంగీతం అందిస్తే.. అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ థ్రిల్‌ ఫీల్ కావడం ఖాయం. బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలోనూ దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ 2' ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: