
వీరిద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. జిమ్‌లో వర్కౌట్స్ చేయడం, కొత్త ఇంటి పూజలో పాల్గొనడం, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్‌లో ఒకరితో ఒకరు ఫోటోలు పంచుకోవడం — ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత రీసెంట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు, వీడియోల్లో రాజ్ నిడుమూరుని ముఖం చూపించకపోయినా, ఆయన చేతులు, చూపిస్తూ.. చిన్న చిన్న హింట్స్ మాత్రం ఇవ్వడం వల్ల నెటిజన్లు కాస్తా మరింత కుతూహలంగా ఉన్నారు. దీంతో సమంత నిజంగానే ప్రేమలో ఉంటే “అవును, మేము ప్రేమలో ఉన్నాం” అని అఫీషియల్‌గా ప్రకటించచ్చు కదా..? అని అడుగుతున్నారు ఫ్యాన్స్.
చాలామంది సెలబ్రిటీలు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నాగ చైతన్య కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. మరి సమంత మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? గతంలో ప్రేమలో పడినప్పుడు ఎదురైన బాధల వల్ల ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉందా? లేక మళ్లీ అదే తప్పు జరగకూడదనే భయంతో మౌనం పాటిస్తోందా? సమంత గత జీవితం అందరికీ తెలుసు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె తన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. ఆరోగ్యం, కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు రాజ్ నిడుమూరుతో ఉన్న సన్నిహిత సంబంధం చూసి అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకుంటున్నారు — “సమంత లైఫ్‌లో కొత్త హ్యాపీ చాప్టర్ మొదలవుతుందా?” అని వెయిట్ చేస్తున్నారు.
వీరిద్దరి కెమిస్ట్రీ సోషల్ మీడియాలో ఊహాగానాలకు అంతం లేకుండా చేస్తోంది. కొంతమంది అభిమానులు “ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలోనే పెళ్లి వార్త వినిపించబోతోంది” అంటుంటే, మరికొందరు “వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే” అని సమర్థిస్తున్నారు. ఏది నిజమో, ఏది ఊహాగానమో చెప్పడం కష్టమే . కానీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది . సమంత -రాజ్ నిడుమూరుతో గడిపే క్షణాలను ఆస్వాదిస్తోంది. అభిమానులు మాత్రం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఆమె మళ్లీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఒకే మాట వినిపిస్తోంది —“సమంత, నీ మనసులో మాట బయట పెట్టు! ఈ సస్పెన్స్‌కు ఎండ్ పెట్టేయ్!”సమంత నిజంగా రాజ్ తో ప్రేమలో ఉందా? లేక ఇది కేవలం బలమైన ఫ్రెండ్షిప్ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం సమంత దగ్గరే ఉంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం — ఆమె ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.