కుల చిచ్చు అనేది సమాజంలో ఎలాంటి ప్రభావం చూపుతోందో చెప్పనక్కర్లేదు.ఈ కులం కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.సమాజంలో తక్కువ కులం వారిని ఎంత నీచంగా చూస్తారో చెప్పనక్కర్లేదు. ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా కులం,మతం అంటూ కొట్టుకు చస్తున్నారు.. అయితే అలాంటి  కుల చిచ్చుకు బలైన వారిలో స్టార్ హీరో రామ్ పోతినేని కుటుంబం కూడా ఉందట. ఈ కుల చిచ్చు వల్ల ఆయన కుటుంబం సర్వం కోల్పోయిందని తాజాగా ఆయన పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో బయట పెట్టారు.. జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి రామ్ పోతినేని గెస్ట్ గా వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈరోజు జీ తెలుగులో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.


అయితే తాజాగా రామ్ పోతినేనికి సంబంధించి ఈ షోలో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే..రామ్ పోతినేని కుటుంబం కులం కారణంగా ఉన్న ఆస్తులన్నీ కోల్పోయిందట.. ఇక విషయంలోకి వెళ్తే.. రామ్ పోతినేని పుట్టిన సమయంలో విజయవాడలో కుల చిచ్చు చెలరేగిందట. ఆ సమయంలో తన కుటుంబం అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ రాత్రికి రాత్రే కోల్పోవలసి వచ్చిందట. దాంతో రామ్ పోతినేని కుటుంబం ఆస్తులు అన్ని కోల్పోయి మళ్లీ రూపాయి నుండి సంపాదించడం మొదలు పెట్టారట.

అలా ఉన్న ఆస్తులన్నీ కోల్పోవడంతో చెన్నైకి వెళ్లి అక్కడే పనులు చేస్తూ సెటిల్ అయ్యారట. అలా రూపాయి నుండి మొదలుపెట్టిన రామ్ పోతినేని తండ్రి జీవితం మళ్ళీ ఇప్పుడు కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యేలా చేసిందట. అలా చిల్లి గవ్వ లేకుండా మొదటి నుండి మళ్ళీ సంపాదించి ఇంత పెద్ద గొప్పవాడు అయ్యాడు కాబట్టే తన తండ్రి అంటే తనకు చాలా గౌరవం అంటూ రామ్ పోతినేని ఈ టాక్ షోలో చెప్పారు.. ఇక రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: