
కానీ ఈ బిగ్ ఈవెంట్‌లో ఒక వ్యక్తి మాత్రం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఆయన ఎవరో కాదు—పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా, “జాన్ జిగిడి దోస్త్”గా పాపులారిటీ సంపాదించిన ఆ వ్యక్తి. సాధారణంగా పవన్ కళ్యాణ్ పేరుతోనే గణేష్‌కు ఎంత అనుబంధమో అందరికీ తెలుసు. అయితే ఇంత పెద్ద పార్టీకి పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ అని చెప్పుకునే ఆ వ్యక్తి హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది.దీంతో సోషల్ మీడియాలో మాత్రం హీట్ పెరిగిపోయింది. “పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్‌కి దేవుడు… ..మరి ఇంత దగ్గరగా ఉండే రైట్ హ్యాండ్ ని ఎందుకు పిలవలేదు?” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వదులుతున్నారు. కొంతమంది అయితే “ఇటీవల గణేష్ మరియు ఆ వ్యక్తి మధ్య కొన్ని అపోహలు చోటు చేసుకున్నాయట” అని చర్చిస్తున్నారు. మరికొంతమంది మాత్రం “గణేష్ నోట మాట ఉంటే అది వాక్యమవుతుంది, ఆయన మనసులో ఏదో కారణం ఉంటుంది” అంటూ ఆయన వైపు బాట వేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి, మరో ప్రముఖ నిర్మాతతో ఉన్న వివాదం గురించి కూడా చాలా న్యూస్ వస్తూనే ఉంది. అందుకే బండ్ల గణేష్ ఈసారి ఆ వ్యక్తిని ఆహ్వానించలేదా? లేక ఆయన స్వయంగా రాలేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.అయితే గణేష్ సన్నిహిత వర్గం చెబుతున్నదాని ప్రకారం—“బండ్ల గణేష్ ఆ వ్యక్తిని కూడా పిలిచారు, కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాలేదు” అని స్పష్టం చేశారు. అయినా సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్, జోక్స్, ఫన్నీ కామెంట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇక బండ్ల గణేష్ హోస్ట్ చేసిన ఈ దీపావళి పార్టీకి సంబంధించిన స్టార్స్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరి స్టైల్ ఏంటో చూపించారు. ఈవెంట్ మొత్తం ఒక చిన్న సినిమా లాగా కనిపిస్తోంది.మొత్తం మీద ఈ దీపావళి రాత్రి టాలీవుడ్‌కి ఫుల్ ఫన్ ఇచ్చింది కానీ—ఒకరిని మాత్రం మిస్ అవ్వడంతో ఆ పార్టీకి “హాఫ్ టికెట్ హాట్ న్యూస్” వచ్చేసింది అనడంలో సందేహమే లేదు.