సినిమా ఇండస్ట్రీ లో ఒక హిట్ కొట్టాలి అంటే కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే అంత కంటే ముఖ్యం అని వాదించే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే కథలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తవి రాయడం అనేది చాలా కష్టమైన పని. అదే కథ పాతది అయినప్పటికీ స్క్రీన్ ప్లే ను సరి కొత్తగా రాసినట్లయితే ఒకే జోనర్ సినిమాలతో కూడా అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇకపోతే ఓ దర్శకుడు దాదాపు ఒకే రకమైన కథలతో కొన్ని సినిమాలను రూపొందించి అందులో మూడు సినిమాలతో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. ఇంతకు ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు బి గోపాల్.

బి.గోపాల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను తన కెరియర్ లో చాలానే రూపొందించాడు. అందులో ఏకంగా మూడు మూవీలతో ఇండస్ట్రీ హిట్ లను కూడా అందుకున్నాడు. మొట్ట మొదటి సారి బి గోపాల్ తన కెరియర్ లో నందమూరి బాలకృష్ణ హీరో గా రూపొందిన సమర సింహా రెడ్డి మూవీ తో ఫ్యాక్షన్ మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈయన బాలకృష్ణ తో నరసింహ నాయుడు అనే మరో ఫ్రాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా బి గోపాల్ "ఇంద్ర" అనే మరో ఫ్రాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా బి గోపాల్ ప్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లతో ఏకంగా మూడు ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: