ప్రభాస్..ఈయన రాజ వంశీయుల ఫ్యామిలీలో పుట్టి, పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన సినిమాల్లోకి రాకముందే ధనికుడు.. అలాంటి ప్రభాస్ అంత ఎత్తు ఎదిగినా ఏనాడు తన స్టేటస్ చూసుకొని విర్రవీగింది లేదు.. ఎంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టునైన గౌరవించే గుణం కలిగిన వ్యక్తి. అందుకే ప్రభాస్ కు ప్రపంచ దేశాలన్నింటిలో ఫ్యాన్స్ ఉన్నారు.. తన తోటి నటీనటులను ఎంతో గౌరవిస్తారు. షూటింగ్ సెట్లో కూడా ప్రభాస్ చాలా ఫ్రీగా, అందరిని కలుపుకొని ముందుకు వెళుతూ ఉంటారు.. అలాంటి ప్రభాస్ షూటింగ్ సెట్లో ఒక నటుడిని దారుణంగా అవమానించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి ఆయన ఎందుకు అవమానించారో పూర్తి వివరాలు చూసేద్దామా.. హనూ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ఫౌజీ సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇందులో ప్రభాస్ తో పాటు రాహుల్ రవీంద్రన్ ని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.. 

అయితే రాహుల్ రవీంద్రన్ ను ఫౌజీ సినిమా షూటింగ్ సెట్లో ప్రభాస్ అనుకోకుండా అవమానించారని ఆయన తాజాగా తన డైరెక్షన్లో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో బయటపెట్టారు..ఆయన మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో నా పాత్రకు సంబంధించినటువంటి షూటింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంది.. నేను పూర్తిగా ఆ పాత్రకు సంబంధించిన మేకప్ వేసుకొని ఉన్నాను. ఇదే సమయంలో ప్రభాస్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. నేను ప్రభాస్ వచ్చిన వెంటనే నమస్తే అని గౌరవించాను.. ఆయన కూడా నాకు నమస్తే పెట్టారు.. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత  ప్రభాస్ వెంటనే డైరెక్టర్ వద్దకు వెళ్లి ఆయన ఎవరు అని అడిగారు.

 వెంటనే హను నన్ను పిలిచి నా మొదటి సినిమాలో హీరో  అని బదులిచ్చాడు..హో రాహుల్ రవీంద్రనా, సారీ బ్రో నన్ను క్షమించండి.. మీరు మేకప్ లో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాను అంటూ బదులిచ్చాడు ప్రభాస్.. ఈ విధంగా ఆరోజు షూటింగ్ సెట్లో మొత్తం ఎప్పుడు నేను కనిపించినా ప్రభాస్ నాకు సారీ చెబుతూనే ఉన్నారు.. చివరికి నేనే బ్రో ఈ గెటప్ లో మా అమ్మ కూడా నన్ను గుర్తు పట్టదు.. ప్లీజ్ మీరు నాకు ప్రతిసారి క్షమాపణలు చెప్పొద్దు అంటూ చెప్పాను..అలాగే ప్రభాస్ చాలా మంచి వ్యక్తి..అందరితో చాలా స్వీట్ గా మాట్లాడుతారు. ఆయనకు  పాన్ ఇండియా హీరో అనే గర్వం ఏమీ ఉండదంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: