తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, హాస్యానికి కొత్త డైమెన్షన్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ మంచి ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ‘పటాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ వంటి సినిమాలతో హిట్‌ ఫార్ములా సృష్టించిన అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, చిరంజీవి మరోసారి ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, యాక్షన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను అలరించబోతున్నారని టాక్‌. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తోంది.


ఇదిలా ఉండగా, అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సారి ఆయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే అనిల్ తన స్టోరీ లైన్‌ను రామ్‌కు వినిపించగా, అది రామ్‌కి బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని సమాచారం. ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని చర్చలు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్‌.



ఇక రామ్ ప్రస్తుతానికి మహేశ్  దర్శకత్వం వహిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతుంది.అయితే, ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అసలు మొదట అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా కొంత చర్చ జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేశారు. “అనిల్ రావిపూడి హాస్య ప్రధానమైన కమర్షియల్ డైరెక్టర్, ఆయన స్టైల్ పవన్‌కి సూట్‌ అవదు. పవన్ సినిమాలు సీరియస్, మాస్ టచ్‌ ఉండాలి” అంటూ నెట్‌లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.



ఈ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినట్టే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానుల ప్రతికూల స్పందన, అంచనాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్‌ నుంచి వెనక్కి తగ్గారని టాక్‌. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, “పవన్ కళ్యాణ్‌కి అనిల్ రావిపూడి వంటి కమర్షియల్ డైరెక్టర్‌తో ఒక వినూత్నమైన ఎంటర్‌టైనర్‌ చేయడానికి మంచి అవకాశం ఉన్నా, ఫ్యాన్స్‌ ఒత్తిడి కారణంగా ఆయన కొంత భయపడి, ఆ నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది” అంటున్నారు. ఏదేమైనప్పటికీ, పవన్‌తో ఆ ప్రాజెక్ట్‌ జరగకపోయినా, అనిల్ రావిపూడి – రామ్ పోతినేని కాంబినేషన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త ఎగ్జైట్మెంట్‌ సృష్టిస్తోంది. ఇద్దరూ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి పేరుగాంచినవాళ్లు కావడంతో ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.చూద్దాం, పవన్‌తో కోల్పోయిన అవకాశాన్ని రామ్‌తో అనిల్ ఎంత మేరకు నెరవేర్చగలడో!

మరింత సమాచారం తెలుసుకోండి: