కిరణ్ అబ్బవరమ్ హీరోగా నటించిన “కె–ర్యాంప్” ఈ దీపావళి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, విన్నర్‌గా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఒక భారీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు.మొదటగా హీరో కిరణ్ అబ్బవరమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బండ్ల గణేష్, ఆయన సింప్లిసిటీని, ప్యాషన్‌ను, కష్టపడి ఎదగాలనే తపనను కొనియాడాడు. “ఇప్పటి రోజుల్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలామంది వెంటనే పెద్ద దర్శకుల పేర్లు తీసుకుంటారు. రాజమౌళి, సుకుమార్, అనిల్ రావిపూడి లాంటి టాప్ డైరెక్టర్లను తీసుకురా అని అహంకారంగా మాట్లాడుతారు. కానీ కిరణ్ అబ్బవరమ్ మాత్రం ప్రతి సినిమాకి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, వారికి అవకాశం ఇస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం” అని ఆయన అన్నారు.


తరువాత ఆయన నేటి యువ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఒక్క సినిమా హిట్ అయితే చాలు... వెంటనే లూజ్ ప్యాంట్లు, కొత్త షూస్, క్యాప్ వేసుకుని స్టైల్ మారుస్తారు. నడక, మాట, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయి. కానీ నటుడు ఎంత విజయవంతమైనా, తన వాస్తవికతను, పాదాలపై ఉండే స్థిరత్వాన్ని కోల్పోవద్దు. అదే నిజమైన స్టార్ లక్షణం” అని బండ్ల గణేష్ సూచించారు.అలాగే కిరణ్ అబ్బవరమ్‌లో ఉన్న వినయం, నిబద్ధత, పట్టుదల చూసి “ఇతనిని చూస్తుంటే చిరంజీవి గారి రోజులు గుర్తొస్తున్నాయి. ఇదే విధంగా కష్టపడి పోతే ఖచ్చితంగా రేపు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతాడు” అంటూ ఆయన ఆశీర్వదించారు.



అయితే ఈ సక్సెస్ మీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు మరో దిశగా వెళ్తున్నాయి. కొంతమంది నెటిజన్లు ఆయన “ఒక సినిమా హిట్ అయిన తర్వాత స్టైల్ మార్చుకునే హీరోల” గురించి మాట్లాడినప్పుడు, అది హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ బండ్ల గణేష్ టార్గెట్ చేసినది విజయ్ కాదు అని మరో వర్గం అంటోంది.ఆ వర్గం ప్రకారం, ఇటీవల తన సినిమాల్లో అత్యధిక బోల్డ్ సీన్లు, లిప్ కిస్‌లు, నాటీ డైలాగ్స్ తో ఓ యువ హీరో విపరీతంగా లైమ్‌లైట్‌లోకి వస్తున్నాడు. షూటింగ్ సమయంలో కూడా అతడు ఓవర్‌గా బిహేవ్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోందట. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఆ హీరోనే టార్గెట్ చేసి ఉండవచ్చని వారు అంటున్నారు.



ఇక అసలు బండ్ల గణేష్ మాటల్లో ఎవరి గురించి చెప్పారన్నది ఆయనకే తెలుసు. కానీ ఆయన మాటలు మామూలు చర్చకు ఆగకుండా, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు దారి తీస్తున్నాయి. “కె–ర్యాంప్” సక్సెస్, కిరణ్ అబ్బవరమ్ పట్ల ఆయన పొగడ్తలు, అలాగే బండ్ల గణేష్ కామెంట్లు – ఇవన్నీ కలసి ఈ ఈవెంట్‌ను టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మార్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: