అజిత్ నటన,కామెడీ,సినిమాటోగ్రఫీ,నేపధ్య సంగీతంఅజిత్ నటన,కామెడీ,సినిమాటోగ్రఫీ,నేపధ్య సంగీతంఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదించడం,పాత రొటీన్ స్టొరీ,పాటలు

వీరేంద్ర(అజిత్) ఒక్కడే తన నలుగురు తమ్ముళ్ళతో కలిసి వీరవరంలో నివసిస్తూ ఉంటాడు. తప్పు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా నిలదీసే మనస్తత్వం వీరేంద్రది. అలా అతనికి చాలా మంది శత్రువులు ఏర్పడతారు. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి తమ్ముళ్ళను పెంచుతాడు వీరేంద్ర, తను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి అన్నదమ్ములను విడదీస్తుందనే సందేహంతో పెళ్లి చేసుకోడు. తమని చిన్నప్పటి నుండి కష్టపడి పెంచిన అన్నయ్యకి పెళ్లి చెయ్యాలని బెయిల్ పెంచలయ్య(సంతానం) తో కలిసి తమ్ముళ్ళు అనుకుంటారు. కలెక్టర్ బుల్లెబ్బాయిని కలిసి వీరేంద్ర గతంలో ఉన్న ప్రేమ కథల గురించి ఆరా తీయగా గోమతి దేవి అనే పేరంటే వీరేంద్రకు ఇష్టమని తెలిసి ఆ పేరుతో ఉన్న అమ్మాయి కోసం వెదకడం మొదలుపెడతారు. అదే సమయంలో గోమతి దేవి(తమన్నా) వీరవరంకి వస్తుంది. అప్పటి నుండి తమన్నా మరియు వీరేంద్ర ను కలపడానికి వీరేంద్ర తమ్ముళ్ళు మరియు పెంచలయ్య ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి వీరేంద్ర , గోమాతితో ప్రేమలో పడిపోతాడు, వీరేంద్ర ను తన కుటుంబానికి పరిచయం చెయ్యాలని అనుకుంటుంది గోమతి, అనుకోని పరిస్థితిలో అక్కడ వీరేంద్ర శత్రువులు దాడి చెయ్యడంతో వీరేంద్ర వారితో గొడవ పడవలసి వస్తుంది. గొడవలంటే ఇష్టపడని గోమతి దేవి ఆ తరువాత వీరెంద్రను ఇష్టపదిందా? ట్రైన్ లో జరిగిన గొడవకి గల కారణం ఏంటి? వీరేంద్ర గోమతి వాళ్ళింట్లో వారిని పెళ్ళికి ఒప్పించగలిగాడా? అన్నవి మిగిలిన కథాంశాలు..

అజిత్ ఈ చిత్రాన్ని ఒంటి చేత్తో మోశారు అని చెప్పుకోవలసిందే, పంచెకట్టులో కూడా స్టైలిష్ గా కనబడి అభిమానులను అలరించారు ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ అజిత్ నటన అని చెప్పుకోవాలి ఇటు కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో అయన నటన చాలా తోడ్పడింది. గోమతి దేవి పాత్రలో తమన్నా నటించడానికి పెద్ద ఆస్కారం లేదు ఉన్నంతలో కనిపించి మెప్పించింది. సంతానం తనదయిన శైలి పంచ్ లతో అలరించాడు. మొదటి అర్ధ భాగంలో కామెడీ కి చాలా సహాయపడ్డాడు. నాజర్ నటన బాగుంది. ఇక తమ్ముల్లుగా నటించిన వారందరు ఓకే అనిపించగా ప్రదీప్ రావత్ పాత్ర మొదట పవర్ ఫుల్ గా మొదలయినా మెల్లగా నీరుగారిపోయింది. అకస్మాత్తు విలన్ గా వచ్చిన అతుల్ కులకర్ణి పర్వాలేదనిపించాడు మిగిలిన నటులందరు అజిత్ నీడలో కనుమరుగయిపోయినవారే...

గతంలో తెలుగులో శౌర్యం, శంఖం మరియు దరువు వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పటిలానే తన పులిహోర కాన్సెప్ట్ తోనే అప్పుడెప్పుడో వచ్చిన నాలుగు చిత్రాలను సెలెక్ట్ చేసుకొని వాటిని మిక్సిలో వేసి ఒక కథను తయారు చేసేసాడు శివ, కథనం విషయంలో జాగ్రత్త వహించడంతో చిత్రంలో ఏమి లేదు అని తెలిసిపోతున్నా కూడా ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదు. దర్శకుడిగా శివ మంచి మార్కులే సంపాదించాడు, కొన్ని సన్నివేశాలలో టేకింగ్ చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ వెట్రి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది ముఖ్యంగా పాటలలో లొకేషన్స్ ని అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ మొదటి అర్ధ భాగంలో చాలా సన్నివేశాలను కత్తిరించే అవకాశం ఉంది. దేవీశ్రీ అందించిన పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా అయన అందించిన నేపధ్య సంగీతం సన్నివేశాలకు చాలా సహాయపడింది. డబ్బింగ్ పనులు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి...

కొన్ని చిత్రాలు స్టార్ పవర్ మీదనే ఆధారపడి వస్తుంటాయి. ఈ చిత్రం సరిగ్గా అలాంటిదే కానీ స్టార్ పవర్ కి కాస్త మంచి కాన్సెప్ట్ తోడయితే అగ్గికి గాలి తోడయినట్టే, ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినా కూడా రొటీన్ గా ఉంది అనిపించేంత రొటీన్ గా ఉంది ఈ చిత్రం. ఇక్కడ వచ్చిన మరో సమస్య ఏంటంటే అజిత్ కి తమిళంలో ఉన్నంత ఫాలోయింగ్ ఇక్కడ లేకపోవడం. ఇది ఎంతవరకు జనంలోకి వెళ్తుంది అని తెలియడం లేదు. మొదటి అర్ధ భాగం అంతా ఒకవైపు రెండావ్ అర్ధ భాగం అంతా మరో వైపు వెళ్తూ ఉంటుంది. ఇంకా చిరాకు పెట్టె విషయం ఏంటంటే ఈ రెండు కథలకు చాలా సన్నని(దాదాపుగా కనబడని) లింక్ ఉండటం. విలన్ ఉండాలి కాబట్టి రెండవ అర్ధ భాగంలో "సడన్ విలన్" అతుల్ కులకర్ణి ప్రత్యక్షం అవుతాడు. అయన పాత్రను పవర్ఫుల్ గా చూపేట్టాలని ప్రయత్నించారు కాని సఫలం కాలేకపోయారు. రెండవ అర్ధ భాగంలో రాబోయే కాన్సెప్ట్ గురించిన చిన్న క్లూ కూడా మొదటి అర్ధ భాగంలో ఉండదు నిజానికి మొదటి అర్ధ భాగం ఒక చిత్రంలా రెండవ అర్ధ భాగం మరో చిత్రంలా అనిపిస్తుంది. తమన్నా ఈ చిత్రంలో "పాటలకు మాత్రమే" అన్న పాత్రను పోషించడంలో సఫలం అయ్యింది అలానే అజిత్ స్టార్ పవర్ నీడలో మరే నటుడు నిలబడలేకపోయినా సంతానం, తంబి రామయ్య తనదయిన శైలిలో కాస్త మెరిసారు. మొత్తానికి మాస్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ ఈ చిత్రం.. మీరు అజిత్ ఫ్యాన్ అయినా మాస్ చిత్రాలను ఇష్టపడే వారయినా ఈ చిత్రం మీకోసమే..

Ajith,Tamanna,Siva Kumar,Vijaya Productions.వీరుడోక్కడే : సినిమాలు మాత్రం రెండు...

మరింత సమాచారం తెలుసుకోండి: