నేటి రోజుల్లో సోషల్ మీడియా అనేది చిత్ర విచిత్రమైన ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మరి విచిత్రమైన ఘటలను  చేస్తుంది ఎవరు అంటే ఇక అది చేసేది కూడా మనుషులే. ఎందుకో గాని టెక్నాలజీకి అనుగుణంగా మనిషి ఆలోచన తీరులో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇక ఈ మార్పులు కొన్ని కొన్ని సార్లు విచిత్రకరమైన ఘటనలకు కారణమవుతున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా మార్కుల హడావిడి కనిపిస్తుంది. వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలవుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు పరీక్షల ఫలితాలలో మంచి మార్కులు సాధిస్తూ సంతోషంలో మునిగిపోతున్నారు. ఇంకొంత మంది విద్యార్థులు అనుకున్న రీతిలో మార్కులు రాలేదు అని నిరాశ చెందుతున్నారు. ఇక మరికొంతమంది విద్యార్థులు ఏకంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము అనే కారణంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే తమ పిల్లలకు మంచి మార్కులు రాకపోతే సాధారణంగా తల్లిదండ్రులు మందలించడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం విచిత్రకరమైన ఘటన జరిగింది. ఏకంగా మార్కులు తక్కువ వచ్చాయని కూతురిని కత్తితో పొడిచింది తల్లీ.


 ఇక కూతురు ఊరుకుంటుందా నన్ను కత్తితో పొడుస్తావా అని ఏకంగా తల్లిని కూడా కత్తితో పొడిచేసింది. ఇలా తల్లీ కూతుళ్లు ఇద్దరు కూడా మార్కుల విషయంలో కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితికి ఇంటర్ ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే మార్కులు ఇలా ఎందుకు తక్కువ వచ్చాయని తల్లి పద్మజా కూతురుతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు సాహితి చనిపోయింది. పద్మజా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: