మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారా మొదట మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఆ తరువాత వెంకటేష్ , మహేష్ బాబు హీరో గా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో అంజలి తెలుగు నాట మంచి విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు వరస గా పెరిగాయి. 

దానితో చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ గీతాంజలి అనే హర్రర్ కామెడీ జోనర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది . ఈ మూవీ మంచి విజయం అందుకుంది . ఇక ఈ మూవీ కి కొనసాగింపు గా "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

ఇక ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చెంజర్ , విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ గోదావరి సినిమాల్లో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: