తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు గుర్తుండిపోయే హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. కేవలం బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించడంతోనే కృష్ణ గారికి అంత గొప్ప గుర్తింపు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు కూడా ఎప్పుడు చేయని ఎన్నో సాహసాలను కృష్ణ గారు చేశారు. ఆ సమయంలో అలాంటి సినిమా రిస్క్ అని ఎంతో మంది అన్నా కూడా వినకుండా ఆయన ఎన్నో ప్రయోగాలను చేసి అందులో చాలా వాటితో సూపర్ సక్సెస్ లను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

దానితో ఆయనకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో అల్లూరి సీతారామరాజు ఒకటి. ఈ మూవీ ద్వారా కృష్ణ గారి క్రేజ్ అద్భుతమైన రీతిలో పెరిగిపోయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 1974 వ సంవత్సరం మే 1 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఏకంగా 18 సెంటర్ లలో వంద రోజులు , రెండు కేంద్రాల్లో 25 వారాలు ఆడి , హైదరాబాదులో సంవత్సరం ఆడింది.

ఇకపోతే ఈ సినిమాలోని "తెలుగు వీర లేవరా" పాటకు రచయిత అయినటువంటి శ్రీ శ్రీ గారికి జాతీయ పురస్కారం కూడా దక్కింది. విజయనిర్మల , కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు , కాంతారావు , చంద్రమోహన్ , ప్రభాకరరెడ్డి , బాలయ్య , త్యాగరాజు , కె.వి.చలం , మంజుల (నటి) , జయంతి , రాజశ్రీ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ కి వి. రామచంద్రరావు ,  కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు. ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్ని సంవత్సరాలు అయినా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: