సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ప్లేయర్ కూడా ఎంతో హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఇక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కాస్త అతి చేయడం చేస్తూ ఉంటారు. తమలోని భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకుండా ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లని  స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో ఎప్పుడైనా ఇలాంటిది జరిగింది అంటే చాలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇక ప్రొఫెషనల్ క్రికెట్లో ఎవరైనా ఆటగాళ్లు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు అంటే చాలు వారు ఎంతటి ఆటగాళ్లు అయినా సరే వారిపై చర్యలు తీసుకునేందుకు అటు ఐసీసీ అస్సలు వెనకడుగు వేయదు. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆడుతున్న ఆటగాళ్లపై కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్ళకు వరుసగా షాకులు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానాకు ఐపీఎల్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది అన్నది తెలుస్తుంది.


 ఐపీఎల్ రూల్స్ ప్రకారం ప్రవర్తన నియమవాలని హర్షిత్ రానా ఉల్లంఘించాడు అన్న కారణంతో అతనికి 100% మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతోపాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ను  అవుట్ చేసిన తర్వాత ఏకంగా అతని ముందుకు వెళ్లి ఫ్లయింగ్ ఇస్తూ రెచ్చగొట్టడంతో హర్షిత్ రానాకి గతంలోనే 60% మ్యాచ్ ఫీజులో కోత విధించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ప్రవర్తన నియమావలిని ఉల్లంఘించి అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఐపీఎల్ మరోసారి అతనిపై కఠినంగా చర్యలు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kkr