ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది  రోజురోజుకి ఎలా మారుతున్నాయో చెప్పడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా కూటమిలో భాగంగా బిజెపి జనసేన టిడిపి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఈ కూటమి సఖ్యత కనిపించలేదనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నరేంద్ర మోడీతో తనకు సన్నిహిత్యం ఉందా లేదా అనే విషయంపై.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పారు.. ఈ విషయం పైన కూడా మోడీ ఎప్పుడూ కూడా స్పందించలేదు. ఇలాంటి సమయంలో కీలకమైన అంశం ఏమిటంటే.. మోడీకి సంబంధించినటువంటి పాయింట్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.




ఇటీవల విడుదలైన మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోనే అని ..అది బిజెపి మేనిఫెస్టో కాదంటూ బిజెపి కూడా తెలియజేసింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సిద్ధార్థ నాథ్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ మేనిఫెస్టో కూడా పట్టుకోకపోవడం కూడా జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు కూడా  బిజెపి నేషనల్ మేనిఫెస్టో కూడా ఉంటుంది. రాష్ట్ర మేనిఫెస్టోకు సైతం బిజెపి మద్దతు ఉంటుందంటూ తెలియజేశారు. బిజెపి పార్టీ కూడా అది అంతవరకు మాత్రమే ఉన్నట్లుగా ప్రకటన చేసింది. నరేంద్ర మోడీ చంద్రబాబుని నమ్మట్లేదు అనే అంతగా వార్తలు వినిపిస్తున్నాయి.



అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు మోడీ మీద వ్యతిరేకత లేదు.. కేవలం సృష్టిస్తామని ప్రయత్నం చేసినప్పటికీ 2019 కి ముందు అందరూ కలిసి విమర్శించడం వల్ల మోడీ మీద వ్యతిరేకత వచ్చింది.. అయితే 2019 నుంచి చూస్తే.. అందరూ పార్టీ నేతలు అందరూ కూడా మోడీ పట్ల గౌరవంతోనే ఉండడంవల్ల మోడీ పట్ల పాజిటివ్ నెస్ వచ్చింది జనానికి. ఈ పాజిటివ్ నెస్ తో పాటుగా.. ఈసారి కేంద్రంలో మళ్లీ మోడీ వస్తారని విషయం చాలా వైరల్ గా మారింది. ఆ మోడీ ఆశీస్సులు తమకు ఉన్నాయని పొత్తు పెట్టుకొని మరి .. పది అసెంబ్లీ సీట్లు.. ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి తమతోనే ఉన్నారని తెలుపుతున్నారు చంద్రబాబు, పవన్. అయితే మోడీ కూటమితో లేరు నాతోనే ఉన్నారని సన్నిహిత్యంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇక్కడ మోడీని ప్రచార అస్త్రంగా వాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: