చంద్రబాబు నాయుడు కాపీ క్యాట్ అని మరోసారి ప్రూవ్ అయింది. నవరత్నాలలో భాగంగా వైసీపీ ఇచ్చిన ఏ హామీని కూటమి వదల్లేదు. విచిత్రం ఏంటంటే జగన్ ఇస్తామని చెప్పిన మొత్తం కంటే మరింత ఎక్కువ మొత్తం ప్రకటించడం ద్వారా వైసీపీకి షాకివ్వాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చేస్తోంది మాయో మోసమో అర్థం కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఆరు పేజీల మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించగా ఈ మేనిఫెస్టోలో మోదీ ఫోటో కూడా లేదంటే బీజేపీ ఈ మేనిఫెస్టోను ఎంతలా నమ్ముతుందో సులువుగానే అర్థమవుతుంది. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో బీజేపీ పేరు నామమాత్రంగా అయినా లేదంటే పార్టీ పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది. ఈ మేనిఫెస్టో నిజంగా మేనిఫెస్టోనేనా లేక వేలం పాటనా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
44 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల క్రితం 200 రూపాయల పింఛన్ ను ఏకంగా 20 రెట్లు పెంచేశారు. అయితే ఈ స్థాయిలో పథకాలను అమలు చేయాలంటే ప్రజలపై పన్నుల భారం కూడా పెంచాల్సి ఉంటుంది. ప్రజలు సైతం తెలివిమీరిపోయారు. సంపద సృష్టించడం మాటలు చెప్పిన తేలిక కాదని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తున్నారు.
 
నవరత్నాలలో భాగంగా ఇచ్చిన హామీలకు స్వల్పంగా మార్పులు చేసి కూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమలు చేయని ఎన్ని హామీలను ప్రకటించినా ప్రయోజనం శూన్యమని మంత్రాలకు చింతకాయలు రాలవని ఓటర్లు చెబుతున్నారు. అలవి కాని హామీలు ఈ ఎన్నికల్లో కూటమిని ముంచుతాయో తేల్చుతాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు ఎన్నికల సమయానికి మరికొన్ని హామీలను ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయానికి ప్రజలకు మరింత భారీ షాకులిచ్చేలా హామీలను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. నవరత్నాల హామీలను కూటమి హామీలను పక్కపక్కన పెట్టుకుని చూస్తే జగన్ ఇచ్చిన ప్రతి హామీ కూటమి మేనిఫెస్టోలో ఉంటుంది. బాబు తెలివితేటలకు ఇంతకు మించి సాక్ష్యాలు అవసరం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: