ఏపీలో ఎన్నికలవేళ విపక్షాల మధ్య పెద్ద మాటల యుద్ధాలే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మేనిఫెస్టోలు విషయమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్న పరిస్థితి. తాజాగా జగన్ బాబు విడుదల చేసిన మేనిఫెస్టోని దృష్టిలో పెట్టుకొని "నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. బాబుది బోగస్ రిపోర్ట్" కొట్టి పారేస్తూ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అవును, తాజాగా టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జగన్ బాబుపై రెచ్చిపోయారు. నాయకుడు అంటే.. ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబతే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలకు అనిపించాలని.. అయితే బాబు మాటలు వట్టి బూటకాలే అన్న భావన తప్ప వేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా మాట్లాడారు.

చంద్రబాబుకు ఓటు వేయడమంటే మళ్లీ మోసపోవడమే అని స్థానిక జనాలకు సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు పేరు చెబితే ఏనాడైనా మీకు ఒక్క పథకం గుర్తుకు వచ్చిందా అక్కలారా? అందుకే ఓటేసే ముందు ఎవరిదీ బోగస్ రిపోర్టు.. ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు? అనేది తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. ఇక జాబ్ రావాలంటే బాబు రావాలి అనే పిచ్చి మాటల్ని మీరు నమ్మకండి. నా చెల్లమ్మళ్ళకి, తమ్ముళ్ళకి ఒక్కటే చెబుతున్నా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు దారుణంగా మోసం చేయడం మీకు తెలిసిందే. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏదో ముష్టి పదిసినట్టు ఉద్యోగాలు పడేసారు తప్ప, ఎవరికి సరియైన ఉద్యోగాలిచ్చారు?" అని ప్రశ్నించారు.

ఇంకా మాట్లాడూతూ... ఆయన హయాంలో పనికి మాలిన 31వేల ఉద్యోగాలిచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం గడిచిన 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో మరే రాష్ట్రము మా మాదిరి ఉద్యోగాలు ఇచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది వట్టి బోగస్ కార్డు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: