ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా ఏ రేంజ్ లో విరుచుకు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నాము అంటూ రష్యా ప్రకటించి దాదాపు నెల రోజులు గడిచిపోతున్నాయి.. అయినప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. రోజు రోజుకి ఉక్రెయిన్ లో పరిస్థితులు అంతకంతకూ అధ్వానంగా మారిపోతున్నాయి. ఇక అక్కడ సైనికులతో పాటు సాధారణ పౌరుల సైతం ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది. అయితే అటు రష్యా దుశ్చర్యను ప్రపంచ దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడం గమనార్హం.


 వెంటనే యుద్ధం ఆపాలంటూ రష్యాకు వ్యతిరేకం గా ప్రపంచ దేశాల లో నిరసనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఎన్నో దేశాల ప్రభుత్వాలు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలాంటి ఆంక్షల నేపథ్యం లో అగ్రరాజ్యమైన రష్యాలో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. అక్కడి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అసలు తగ్గుముఖం పడుతుందా  లేదా అనుకుంటున్న సమయం లో రష్యా ఇటీవలే ఒక కీలక ప్రకటన చేసింది.



 ఉగ్ర వాదంపై చేపట్టిన సైనిక చర్య లో మొదటి దశ దాదాపు పూర్తయింది అంటూ రష్యా రక్షణ శాఖ వెల్లడించడం గమనార్హం. ఇక ఆ తరువాత ఆపరేషన్ విషయం లో రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నామని రక్షణ శాఖ చెప్పింది. ఒకటి డాన్ బాస్ లోని వేర్పాటువాద ప్రాంతాల్లోని దాడులు చేయడం.. రెండవది ఉక్రెయిన్ మొత్తాన్ని  విస్తరించడం.. ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని ముందుకు సాగుతాం అంటూ రక్షణశాఖ చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్లోని వైమానిక నావికా దళం లోని చాలా బాగాన్ని తమ దళాలు నాశనం చేశాయి అంటూ రష్యా ప్రకటించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: