అమెరికా ను వ్యతిరేకించిన దేశాలపై కూడా పగ తీర్చుకునేది అమెరికా. అందుకే అమెరికా అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలు భయపడేవి. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా స్థాయి రోజురోజుకు తగ్గుతుంది అని అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా జో బైడెన్ వచ్చిన తర్వాత అమెరికా ని ఎవరు కూడా అగ్రదేశం గా చూడటం లేదు. ఇక చిన్న దేశాలు సైతం అమెరికా నీ లైట్ తీసుకుంటున్నాయి అని చెప్పాలీ. ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన రష్యా అమెరికా ను లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటోంది. చైనా కూడా పెద్దగా అమెరికా ను పట్టించుకోవడం లేదు.
ఇక దుబాయ్ ఏకంగా అమెరికా ఆయుధాలను వద్దు అని చెప్పి అమెరికా కు షాక్ ఇచ్చింది. ఇక సౌదీఅరేబియా ఏకంగా ముడి చమురు వాణిజ్యం విషయంలో అమెరికా డాలర్ ను కాదని చైనా కు చెందిన యువాన్ తో వ్యాపారం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక మరోవైపు అమెరికా ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఉత్తరకొరియా అధ్యక్షుడు వరుసగా వరుసగా క్షిపణుల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఇక తాలిబన్లు సైతం అమెరికా చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో బైడెన్ వచ్చి అమెరికాను ఉద్ధరించాడా లేదా స్థాయిని తగ్గించడా అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి