కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అగ్ర దేశాలతో దౌత్య పరమైన సంబంధాలను మెరుగు పరచుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు మెయిన్టెయిన్ చేస్తూ వాణిజ్యపరమైన ఒప్పందాలను మరింత బలపరుచుకుంటుంది భారత్. అదే సమయంలో ఇక విదేశాంగ విధానంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. అగ్ర దేశాలతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్న భారత్.. అటు ఏ దేశానికి బానిస గా ఉండడానికి మాత్రం ఇష్టపడటం లేదు.


 అగ్రదేశాలు భారత్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కౌంటర్లు ఇస్తూ ఉంది భారత్.ఈ క్రమంలోనే శత్రు దేశమైన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్  సైతం భారత విదేశాంగ విధానం పై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానం ఎంతో బలంగా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు రష్యా మంత్రి సైతం భారత విదేశాంగ విధానం పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.  ఇటీవలి కాలంలో అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో అటు రష్యాకు ఇటు ఉక్రెయిన్ కి మద్దతు ఇవ్వకుండా తటస్థ ధోరణితో ఉంది భారత్.


 అదే సమయంలో అమెరికా నిషేధం విధించిన రష్యాతో సత్సంబంధాలను మరింత మెరుగు పరుచుకుంటూ ఉంది. అయితే తీరు మార్చుకోవాలని భారత ను అమెరికా హెచ్చరించినా తమ దేశ కోసం ఏం చేయాలో మాకు తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చింది భారత్. ఇదే విషయమై ఇటీవల రష్యా మంత్రి కార్గి లేవ్ రోస్ స్పందిస్తూ  ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు కొన్ని సవాలు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంలో కీలక నిర్ణయం తీసుకోవడం  హర్షణీయమన్నారు. దేశ అభివృద్ధికి అభ్యున్నతికి ఏదైతే అవసరమని భారత్ భావిస్తుందో తాము కూడా అదే దారిలో వెళ్లాలని అనుకుంటున్నాము అంటూ రష్యా మంత్రి తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: