సాధారణంగా ఫ్యాషన్ ఆర్టిస్టులు మిగతా వాళ్లతో పోల్చి చూస్తే కాస్త విభిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఫాలో అయ్యే ఫ్యాషన్స్ కాస్త కొత్తగానే ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్యాషన్ ఆర్టిస్ట్ ఎంతో ఇష్టంగా ఒక రింగు చేయించుకుని ముక్కుకు అలంకరించుకున్నాడు. అయితే ఇలా రింగ్ ముక్కు పెట్టుకున్న కొన్ని రోజుల తర్వాత అది కనిపించకుండా పోయింది. ఇలా జరిగి ఐదేళ్లు అవుతుంది. అయితే ఆ రింగ్ ఏమై ఉంటుందో అని ఇల్లంతా వెతికాడు. అయినా కనిపించలేదు.ఏకంగా మనుషులను పెట్టి మరి ఆ రింగు కోసం వెతికించాడు. అయినా లాభం లేకుండా పోయింది.


 ఇక వెతికి ఉపయోగం లేదు అని భావించి ఆ రింగు గురించి మర్చిపోయాడు. కానీ అనుకొని విధంగా ఐదేళ్ల తర్వాత ఆ రింగ్ ఎక్కడుంది అన్న విషయం మాత్రం అతనికి తెలిసిపోయింది. ఇంతకీ ఆ రింగు ఎక్కడుందో తెలుసా ఏకంగా అతని ఊపిరితిత్తుల్లో... వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్న.. ఇది నిజంగానే జరిగింది.  అమెరికాకు  చెందిన ఫ్యాషన్ ఆర్టిస్ట్ జోలికిన్స్ చాలా కాలం నుంచి దగ్గు ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాడు   మందులు వాడుతున్న సమస్య నయం కావడం లేదు.


 ఈ క్రమంలోని ఇటీవల డాక్టర్లను సంప్రదించాడు సదరు వ్యక్తి. అయితే డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే ఎక్స్ రే కూడా తీశారు. ఇక తర్వాత వచ్చిన రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అతని ఊపిరితిత్తుల్లో నోస్ రింగ్ చిక్కుకుందని వెంటనే ఆపరేషన్ చేసేదాన్ని తొలగించాలి అంటూ డాక్టర్లు తెలిపారు. అయితే ఇన్నేళ్ల నుంచి రింగ్ లోపలే ఉన్నప్పటికీ ఊపిరితిత్తులను చీల్చకుండా ఉండడం నిజంగా అదృష్టం అంటూ వైద్యులు చెబుతూ ఉండడం గమనార్హం. కాగా  ఎక్స్రే చూసినప్పుడు రింగ్ ఊపిరితిత్తుల్లో ఉంది అన్న విషయం నాకు తెలియగానే ఆశ్చర్యపోయాను అంటూ సదరు వ్యక్తి చెబుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri