
అయితే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడం అనేది అనుకున్నంత సులభం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం ప్రతిరోజు చేసే పనినే కాస్త కొత్తగా ఎవరికి సాధ్యం కాని రీతిలో చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో తమ పేరును ఎక్కించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసి అరుదైన రికార్డు సాధించాడు అని చెప్పాలి.
ఇటీవల కాలంలో ఎంతోమంది వర్కౌట్స్ చేసిన చేయకపోయినా ఇంట్లో అయినా సరే పుష్ అప్స్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ఇలాంటి పుష్ అప్స్ ని అతను చేసి ఇటీవలే గిన్నిస్ రికార్డును సృష్టించాడు. ఏకంగా రోజుకి 100 పుషప్స్ కొట్టడమే గ్రేట్. ఇలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి గంటలో ఏకంగా 3 వేలకు పైగా పుష్ ఉష్ అప్స్ కొట్టి గిన్నిస్ రికార్డును సృష్టించాడు. 33 ఏళ్ల లుకాస్ సగటున నిమిషానికి 53 చొప్పున గంటలో 32p6 పుష్ అప్స్ చేసాడు అని చెప్పాలి. 2022లో గంటలో 3182 పుషప్స్ కొట్టిన డేనియల్ రికార్డింగ్ బ్రేక్ చేశాడు లుకాస్. ఇకనుంచి ఏడాదికి ఒక రికార్డు బద్దలు కొడతాను అంటూ చెబుతున్నాడు లూకాస్.