ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు సృష్టిస్తున్న  అరాచకాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి.  ఆయుధాలను చేతపట్టి..  అరాచకాలు సృష్టించి ప్రజలను బానిసలుగా మార్చుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేస్తూ..  మాట వినండి లేక పోతే ప్రాణాలు పోతాయి అంటూ బెదిరిస్తూ ఏకంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ వశం చేసుకున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్ లు హస్తగతం చేసుకోవడంతో ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం మొత్తం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే  మేము ఉగ్రవాదులం కాదు అని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఉగ్రవాదానికి మరో రూపమే ఈ తాలిబన్లు అన్నది ప్రపంచ దేశాలకు తెలుసు.


 ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ కూడా తాలిబన్లకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటుంది అన్నది కూడా అందరికీ తెలిసిందే.  ఇలాంటి సమయంలో తాలిబన్ ఉగ్రవాదులు కలిసిపోయి రానున్న రోజుల్లో ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇటీవల కాలంలో బయటికి వస్తున్న కొన్ని స్టేట్మెంట్లు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటి ఒక స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇప్పటికే తాలిబన్ల లో ఒక వర్గం మేం భారత్ కి జోలికి రాము అంటూ స్పష్టం చేస్తోంది. కానీ అదే తాలిబన్ల లోని మరో వర్గం మాత్రం భారత్కు హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ మా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల గురించి ఇతర దేశాలతో భారత్ చర్చించ కూడదు.. మీ దేశ వ్యవహారాలు మీరు చూసుకోండి  అంటూ గుల్బుద్దీన్ హిక్మాత్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ ప్రేమికుడు పాకిస్థాన్ ప్రేరేపితుడు అయిన గుల్బుద్దీన్ హిక్మాత్ ఒకప్పుడు తాలిబన్లను వ్యతిరేకించి ఇక తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేశాడు. తాలిబన్ల విషయంలో కసాయిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాలిబన్లతో కలిసిపోయి ఏకంగా తాలిబన్లకు భారత్ పై వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడూ.  దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: