తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తుంది. రాజకీయంగా పార్టీ విషయంలో చాలా అనుమానాలు ఉన్న వాళ్లకు నివృత్తి చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకునే చర్యలు కాస్త కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి హుషారు ఇస్తున్నాయి అనే మాట నిజం. ప్రతీ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని అని వర్గాలను కలుపుకుని పోయే విధంగా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటె మీద్ ఉలా నభి సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కుల మతాల సామరస్యం కోసం సద్బావన యాత్ర ను చేపట్టి చార్మినార్ ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ పునీతం చేసారు అని ప్రస్తావించారు. ఈ దేశం వందల కులాలు, మతాలతో కూడుకున్న వసుదైక కుటుంబం అని అన్నారు ఆయన. ఈ దేశ సమైఖ్యతకు ఇందిరా గాంధీ తన ప్రాణాలు అర్పించారు అని ఆయన తెలిపారు. కుల, మతాల ను రెచ్చగొట్టి   ఓక పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తే.. దేశ సమైఖ్యత కోసం రాజీవ్ గాంధీ  దేశం మొత్తం సద్బావన యాత్ర చేపట్టారు అని ఆయన వివరించారు.

ప్రాంతాలు, మతాల ముసుగులో కొన్ని పార్టీ లు అధికారం లోకి వచ్చి విర్రవీగుతున్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కర్ణాటక సీఎం గా మైనారిటీ ల  జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తి వీరప్పమొయిలీ అని కొనియాడారు. ఉమ్మడి ఏపీ లో వైఎస్ హాయాంలో  ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది.. కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఆయన. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు ఆయన. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని ధీమా వ్యక్తం చేసారు. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: