టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో..టీడీపీ దరిద్రం కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు చంద్రగిరి బాబు పుట్టిన గడ్డ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే బాబు కూడా రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో..చంద్రగిరి నుంచి ఫస్ట్ టైమ్ పోటీలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 1978లో విజయం సాధించారు. కానీ 1983లో టీడీపీ చేతుల్లోనే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు.
 
ఆ తర్వాత నుంచి రాజకీయ ప్రయాణం ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. ఆ విషయం పక్కనబెడితే...చంద్రగిరిలో టీడీపీ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూస్తే..1983లోనే చంద్రబాబుని ఓడించి టీడీపీ సత్తా చాటింది. ఆ వెంటనే 1985లో కూడా టీడీపీ విజయం సాధించింది. ఇక 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గల్లా అరుణ కుమారి విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ తరుపున చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు విజయం సాధించారు.

ఇంకా అంతే లాస్ట్...చంద్రగిరిలో టీడీపీకి అదే చివరి విజయం..మళ్ళీ అక్కడ పార్టీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్తా చాటారు. భవిష్యత్‌లో కూడా చంద్రగిరిలో చెవిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం జరిగే పని కాదు. ఇక్కడ టీడీపీ తరుపున పులివర్తి నాని పనిచేస్తున్నారు. నాని కూడా బాగానే పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

అయినా సరే చెవిరెడ్డిని దాటే సత్తా నానికి లేదు. ఎందుకంటే చెవిరెడ్డి ప్రజల మనిషి..ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చిన అండగా ఉంటారు. అందుకే ప్రజలు కూడా చెవిరెడ్డికి అండగా ఉంటారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల్లో అద్భుతమైన పనితీరు కనబర్చే ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి టాప్‌లో ఉన్నారు. ఇక ఈయన్ని ఓడించడం కష్టమని నానికి కూడా అర్ధమైంది..అందుకే ఆయన చిత్తూరు అసెంబ్లీకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ గల్లా ఫ్యామిలీని మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన మార్పులు వచ్చేలా లేవు..చంద్రగిరిలో చెవిరెడ్డికి బ్రేకులు వేయడం కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: