ఇటీవల కాలంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అయితే మొన్నటి వరకు ఉగ్రవాద దేశాలు అంటే పాకిస్తాన్, టర్కీ, సిరియా లాంటి దేశాలు మాత్రమే అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు ఇతర దేశాల్లో కి వెళ్లడం అక్కడ ఉన్న యువతలో ఉగ్రవాద భావజాలాన్ని రెచ్చగొట్టి ఇక ఉగ్రవాదులు గా మార్చడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం పాకిస్తాన్ సిరియా లాంటి దేశాలలో మాత్రమే కాదు అగ్ర దేశాలలో సైతం ఇటీవల కాలంలో ఎంతో మంది యువత ఉగ్రవాదం వైపు నడుస్తూ ఉండటం గమనార్హం. ఇలా ఉగ్రవాదులు పాకిస్థాన్, సిరియా లాంటి ఉగ్రవాద దేశాల నుంచి ఉద్యోగం వ్యాపారం  నిమిత్తం వెళ్లడం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్లిన పని చేసుకోకుండా ఉగ్ర వాద భావజాలాన్ని అక్కడ యువతలో రెచ్చగొట్టి వాళ్లను కూడా ఉగ్రవాదులు గా మార్చడం లాంటివి చేస్తున్నారు.



 సాధారణంగా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టాప్ కమాండర్ జైలులో ఉన్న సమయంలో ఇక అమాయక ప్రజలను బంధించి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కమాండర్ ను వదిలి పెడితే ప్రజలను వదిలి పెడతాం అంటూ ప్రభుత్వం ముందుకు డిమాండ్ తీసుకు రావడం లాంటివి ఇప్పటికే ఎన్నోసార్లు జరిగాయి. ఇటీవల అగ్ర దేశమైన అమెరికా లో ఇలాంటి తరహా ఘటన జరిగింది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ సిరియా దేశాలకు చెందిన ఉగ్రవాది కాదు ఏకంగా  బ్రిటన్ లో పుట్టి పెరిగి ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైన ఒక యువకుడు ఇటీవల అమెరికాలోని ఒక కుటుంబాన్ని బంధించి ఏకంగా జైలులో ఉన్నా పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదిని వదిలిపెట్టాలి అంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారిపోయింది.


 ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారగా.. వెంటనే రంగంలోకి దిగిన అమెరికన్ ఆర్మీ ఆ యువకుడిని మట్టుపెట్టింది.  ఆ తర్వాత ఈ ఘటనపై విచారణ జరపగా సదరు ఉగ్రవాదికి సహకరించింది తీవ్రవాద  భావజాలానికి ఆకర్షితులైన అమెరికాలోని ఇద్దరు యువకులు అన్న విషయం తేలింది. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఇలాంటి చర్య ముమ్మాటికీ ఉగ్రవాదమే అంటూ తేల్చి చెప్పారు. బ్రిటన్లో ఎంతోమంది ఇలా యువత ఉగ్రవాదులుగా మారుతున్నారని అప్రమత్తంగా ఉండాలి అంటూ బ్రిటన్కు కూడా లేఖ రాయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: