వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అన్నీ పార్టీలు కలిసి పోరాటంచేయాలి. పొత్తులు పెట్టుకోవటంలో తాము త్యాగాలకు కూడా సిద్ధం..ఇది చంద్రబాబునాయుడిచ్చిన పిలుపు.


ఇదే సమయంలో కుటుంబ, అవినీతిపార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు..త్యాగాలకు సిద్ధమని ప్రకటించిన వారి త్యాగాలేమిటో గతంలోనే చూశాం..ఇది సోమువీర్రాజు స్పందన. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీతో పొత్తుపెట్టుకోవాలన్న కోరికను  చంద్రబాబు బహిరంగం చేయలేదు. అలాగే టీడీపీతో పొత్తుండదని వీర్రాజు కూడా డైరెక్టుగా చెప్పలేదు.





బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది విచిత్రమైన పరిస్ధితి. ఎలాగంటే పవన్ కు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని మనసులో బలంగా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబుతో పొత్తును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తనంతట తానుగా పొత్తుకు బీజేపీ రెడీ అంటే తప్ప పొత్తు సాధ్యంకాదు. ఈ నేపధ్యంలోనే బీజేపీని ఎలా దారితెచ్చుకోవాలో తెలీక చంద్రబాబు, పవన్ ఇద్దరిలోను అయోమయం పెరిగిపోతున్నట్లుంది. పొత్తుల గురించి చంద్రబాబు ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు వీర్రాజు అడ్డం పడుతునే ఉన్నారు. 





బీజేపీని కాదని చంద్రబాబుతో పొత్తులో వెళ్ళటానికి పవన్ ఇప్పటికప్పుడు ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే బలంగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో శతృత్వం తెచ్చుకోవటం పవన్  ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. నిజంగా కేంద్రప్రభుత్వం వెంటపడటం మొదలైతే అది పవన్ తో మాత్రమే ఆగదు చంద్రబాబును కూడా తప్పకపోవచ్చు.  అందుకనే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుందనగా బీజేపీతో పెట్టుకోవటానికి ఇద్దరు ఇష్టపడటంలేదు. ఇప్పటికైతే చంద్రబాబు సేఫ్ గానే ఉన్నారు.





తమనుండి పవన్ను విడదీశారని బీజేపీకి గనుక మండితే అప్పుడు చంద్రబాబుకూ సమస్యలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఆ పరిస్ధితి అంతవరకు తెచ్చుకోకుండానే బీజేపీని ఏదో పద్దతిలో దారితెచ్చుకోవటమే మంచిదని ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఆ పద్దతే ఏమిటో అర్ధంకాక నానా అవస్తలు పడుతున్నారు. అయితే పవన్ను సీఎం క్యాండిడేట్ గా చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు టీడీపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని కమలనాదుల్లో చర్చ జరుగుతోంది.  మరి చివరకు ఏమవుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: