హరీష్ రావు దుబ్బాకలో రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.. దుబ్బాకలో.. గత ఆరేళ్లుగా ఎలాంటి పనులు జరగలేదన్న అసంతృప్తి అక్కడి ప్రజల్లో ఉంది. దీన్ని తగ్గించడానికే.. తానొచ్చానన్న అభిప్రాయాన్ని కల్పించడానికి హరీష్ ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని హరీష్ తక్కువగా అంచనా వేయడం లేదు. కాంగ్రెస్లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలకు కండువాలు కప్పారు. ఇతర నేతలపైనా గురి పెట్టారు.